తొలిరోజు భారీగా..

27 Apr, 2019 10:13 IST|Sakshi
మాడ్గులపల్లి : నామినేషన్‌ వేస్తున్న కళింగారెడ్డి 

మిర్యాలగూడ : ప్రాదేశిక ఎన్నికల రెండో విడత నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఈ నెల 28వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ఉన్నప్పటికీ తొలిరోజే భారీగా నామినేషన్లు వచ్చాయి. వివిధ రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. మిర్యాలగూడ డివిజన్‌ పరిధిలోని పది మండలాల్లో పది జెడ్పీటీసీ, 109 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా స్థానాలకు నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు స్వీకరించారు. తొలిరోజు 109 ఎంపీటీసీ స్థానాలకు గాను 261 మంది అభ్యర్థులు 264 నామినేషన్లు దాఖలు చేశారు. అదే విధంగా పది జెడ్పీటీసీ స్థానాలకు గాను 32 మంది అభ్యర్థులు 34 నామినేషన్లు దాఖలు చేశారు.

పార్టీల వారీగా ఇవీ నామినేషన్లు
ప్రాదేశిక ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు పోటా పోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. మిర్యాలగూడ డివిజన్‌ పరిధిలోని పది మండలాల్లో 109 ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ – 3, సీపీఐ(ఎం) – 11, కాంగ్రెస్‌ – 92, టీఆర్‌ఎస్‌ – 141, టీడీపీ – 2, స్వతంత్ర అభ్యర్థులు – 15, మొత్తం 264 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా పది జెడ్పీటీసీ స్థానాలకు గాను బీజేపీ – 1, సీపీఐ(ఎం) – 3, కాంగ్రెస్‌ – 15, టీఆర్‌ఎస్‌ – 11, టీడీపీ –2, స్వతంత్ర – 2, మొత్తం – 34 నామినేషను దాఖలయ్యాయి.

మరిన్ని వార్తలు