ప్రకాశం: ఓటర్‌ లిస్టుంది సరే.. మరి మీ పేరుందా?

10 Mar, 2019 10:19 IST|Sakshi

♦ నేషనల్‌ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌ (www.nvsp.in) ఓపెన్‌ చేసి అందులో పేరు కానీ, ఓటర్‌ ఐడీ కార్డు ఎపిక్‌ నంబర్‌ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు.

♦ 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు.

 www.ceoandhra.nic.in  వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే search your name పేరుతో ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది.

♦ జిల్లా కలెక్టరేట్‌లోని ఎన్నికల ప్రత్యేక సెల్‌లో ఓటరు కార్డు ఎపిక్‌ నంబర్‌ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. 

♦ మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్‌ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు.

♦ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు Check Your Vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు.

♦ సాధారణంగా ఎన్నికల నామినేషన్‌కు వారం ముందు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు.

మీ మీ మండలాల తహసీల్దార్‌ కార్యాలయంలో ఉండే కింది నంబర్లకు చెందిన అధికారులకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

కనిగిరి - నాసిరుద్దిన్, ఎలక్షన్‌ డీటీ - 97049 98500

కనిగిరి - కె.రాజ్‌కుమార్, తహసీల్దార్ - 88866 16059

పామూరు - ఆర్‌.వాసుదేవరావు, డిప్యూటీ తహసీల్దార్ - 88866 16069

వెలిగండ్ల - టి.కోటేశ్వరరావు, తహసీల్దార్ - 88866 16082

పీసీపల్లి - సత్యనారాయణ ప్రసాద్, తహసీల్దార్ - 88866 16068

సీఎస్‌పురం - జి.శ్రీనివాసులు, తహసీల్దార్ - 88866 16049

హెచ్‌ఎంపాడు - ఎస్‌.రామలింగేశ్వరరావు,తహసీల్దార్ - 88866 16056 

- ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం

మరిన్ని వార్తలు