సచిన్ తరువాత ఆసీస్ క్రికెటర్

18 Nov, 2017 14:45 IST|Sakshi

టౌన్స్ విల్లే: ఆస్ట్రేలియా యువ క్రికెటర్ జాసన్ సంఘా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇంగ్లండ్ పై అత్యంత పిన్నవయసులో సెంచరీ సాధించిన రెండో క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. వార్మప్ మ్యాచ్ లో భాగంగా క్రికెట్ ఆస్ట్రేలియా ఆటగాడైన సంఘా 18 ఏళ్ల 68 రోజుల వయసులో ఇంగ్లండ్ పై సెంచరీ సాధించాడు. 

ఈ క్రమంలోనే శ్రీలంక క్రికెటర్ హసన్ తిలకరత్నే(18 ఏళ్ల,223 రోజులు) రికార్డును సంఘా సవరించాడు. అయితే ఇంగ్లండ్ పై ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో పిన్నవయసులో సెంచరీ సాధించిన రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(17 ఏళ్ల,107 రోజులు) పేరిట ఉంది. ఇదిలా ఉంచితే, సచిన్ సరసర చేరిన జాసన్ సంఘా భారత సంతతికి చెందిన వాడు కావడం ఇక్కడ మరో విశేషం.


 

మరిన్ని వార్తలు