టి20 ప్రపంచకప్‌ను రద్దు చేయకండి: హాగ్‌

16 Apr, 2020 00:23 IST|Sakshi
బ్రాడ్‌ హాగ్

మెల్‌బోర్న్‌: ఏదేమైనా సరే ఆస్ట్రేలియా ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లలో టి20 ప్రపంచకప్‌ నిర్వహించాల్సిందేనని ఆ దేశ మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హాగ్‌ అన్నాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా లేదంటే రద్దు లాంటివి చేయవద్దని సూచించాడు. ‘ప్రపంచకప్‌పై చాలా చర్చ జరుగుతోంది. ఈవెంట్‌ను రద్దు చేయడమో లేదంటే  రీషెడ్యూల్‌ చేస్తారంటున్నారు. ఇది సరికాదు. పకడ్బందీ చర్యలు తీసుకుంటే కప్‌ నిర్వహణ సాధ్యమే. పాల్గొనే అన్ని జట్లను ఓ నెలన్నర ముందుగానే చార్టెడ్‌ ఫ్లయిట్‌లలో ఇక్కడికి తీసుకురావాలి. క్వారంటైన్‌ సహా కరోనా పరీక్షలు చేసేందుకు వీలవుతుంది. అలాగే ఈ సమయంలో వారి సన్నాహాలు జరుగుతుంటాయి. షెడ్యూలు వరకల్లా మెగా ఈవెంట్‌ను అనుకున్నట్లే ప్రారంభించవచ్చు’ అని హాగ్‌ సూచించాడు. 

మరిన్ని వార్తలు