ఐదో టీ20 : టీమిండియాకు మరో షాక్‌..!

3 Feb, 2020 18:20 IST|Sakshi

మౌంట్‌మాంగనీ : కివీస్‌తో ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత జట్టుకు షాక్‌ తగిలింది. చివరి టీ20లో స్లోఓవర్‌ రేట్‌ కారణంగా ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తున్నట్టు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్‌ 2.22 ప్రకారం ప్రతి ఓవర్‌ నిర్ణీత సమయంలో పూర్తి కావాలి. లేనిపక్షంలో ఒక ఓవర్‌కు 20 శాతం చొప్పున ఆటగాళ్లు, ఆ జట్టు సిబ్బంది మ్యాచ్‌ ఫీజులో కోత తప్పదు. టీమిండియా చివరి టీ20లో ఒక ఓవర్‌ ఆలస్యంగా మ్యాచ్‌ను ముగించింది. ఫీల్డ్‌ అంపైర్లు క్రిస్‌ బ్రోన్‌, షాన్‌ హేగ్‌ ఫిర్యాదు మేరకు టీమిండియాకు జరిమానా తప్పలేదు’అని మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ తెలిపారు.
(చదవండి : రోహిత్‌ శర్మ ఔట్‌.. రిజర్వ్‌ ఓపెనర్‌ ఎవరు?)

ఇక టీమిండియా స్టాండ్‌ ఇన్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్లోఓవర్‌ రేట్‌ను అంగీకరించిన నేపథ్యంలో తదుపరి వాదనలు ఉండవని రిఫరీ వెల్లడించారు. ఇదిలావుండగా.. వెస్ట్‌ప్యాక్‌ స్టేడియంలో జరిగిన నాలుగో టీ20లోనూ టీమిండియా రెండు ఓవర్లు ఆలస్యంగా మ్యాచ్‌ను ముగించింది. దీంతో భారత ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 40 శాతం పెనాల్టీ విధించారు. కాగా, ఆదివారం జరిగిన ఐదో టీ20లో టీమిండియా 7 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 5–0తో క్లీన్‌స్వీప్‌ చేసిన తొలి జట్టుగా భారత్‌ కొత్త చరిత్ర సృష్టించింది.
(చదవండి : నెవర్‌ బిఫోర్‌... 5-0)

>
మరిన్ని వార్తలు