బాయ్‌ఫ్రెండ్‌కు గుత్తా జ్వాల స‌ర్‌ప్రైజ్‌

17 Jul, 2020 16:19 IST|Sakshi

పుట్టిన రోజు నాడు అంద‌రూ శుభాకాంక్ష‌లు చెప్తారు. కానీ కొంద‌రే గిఫ్టులిస్తారు. అందులోనూ కొన్ని స‌మ్‌థింగ్ స్పెష‌ల్ ఉంటాయి. ‌ప్రేమికులైతే ఒక‌రికొరు పోటీప‌డుతూ మ‌రీ బ‌హుమ‌తులిచ్చుకుంటారు. అయితే బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి గుత్తా జ్వాల మాత్రం త‌నే పెద్ద గిఫ్ట్ అంటున్నారు. శుక్ర‌వారం పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న ఆమె బాయ్‌ఫ్రెండ్, త‌మిళ న‌టుడు విష్ణు విశాల్‌ ఇంటి ముందు ప్ర‌త్య‌క్ష‌మై అత‌డిని స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్ చేశారు. కాగా లాక్‌డౌన్ వ‌ల్ల ప్రేమికుడిని మిస్ అవుతున్నానంటూ గుత్తా విర‌హ వేద‌న చెందిన సంగ‌తి తెలిసిందే. (హీరోతో గుత్తా జ్వాల.. ఫోటోలు వైరల్‌)

అయితే ఇప్పుడు ఎంచ‌క్కా ప్రియుడి పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని హైద‌రాబాద్ నుంచి చెన్నైకు వెళ్లారు. అత‌ని బ‌ర్త్‌డే వేడుక‌ను ద‌గ్గ‌రుండి నిర్వ‌హించారు. ఈ విష‌యాన్ని న‌టుడు విష్ణు సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. చేతిలో కేక్ ప‌ట్టుకుని గుత్తాతో క‌లిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.‌ న‌టుడు విష్ణు విశాల్‌ 2018లో తన భార్య రజనీతో విడిపోయిన విషయం తెలిసిందే. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఆర్య‌న్‌ ఉన్నాడు. మరోవైపు గుత్తా జ్వాల కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌తో విభేదాల కారణంగా విడిపోయారు. (బాయ్‌ఫ్రెండ్‌ను మిస్‌ అవుతున్నా)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు