Ananya Panday: బాయ్‌ఫ్రెండ్‌ బర్త్‌ డే.. లైగర్ భామ స్పెషల్ పోస్ట్!

16 Nov, 2023 16:50 IST|Sakshi

బాలీవుడ్ భామ అనన్య పాండే తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. లైగర్‌ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్‌ కపూర్‌తో డేటింగ్‌లో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇటీవలే కాపీ విత్ కరణ్ షోలో పాల్గొన్న తమ రిలేషన్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తామిద్దరం మంచి స్నేహితులమని వెల్లడించింది. 

తాజాగా ఇవాళ తన ప్రియుడు ఆదిత్య రాయ్ కపూర్ బర్త్‌ డే సందర్భంగా స్పెషల్ విష్ చేశారు. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో అతని ఫోటోను షేర్ చేశారు. ఆదిత్య ఫోటోను షేర్ చేస్తూ "హ్యాపీ బర్త్‌డే ఏడీ" అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా.. ఇటీవలే అనన్య బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకునేందుకు ఇద్దరు కలిసి మాల్దీవులకు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను అనన్య సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.‍ ఈ ఏడాది డ్రీమ్ గర్ల్-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనన్య.. ప్రస్తుతం కో గయే హమ్ కహాన్ చిత్రంలో నటిస్తోంది. అర్జున్ సింగ్ డైరెక్షన్‌లో గౌరవ్ ఆదర్శ్ నటిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

మరిన్ని వార్తలు