విజేత రుత్విక శివాని

18 Nov, 2019 03:35 IST|Sakshi

పుణే: అఖిల భారత సీనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో క్వాలిఫయర్‌ రుత్విక 21–10, 21–17తో శ్రుతి ముందాడ (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. ఖమ్మం జిల్లాకు చెందిన రుత్విక ఈ టోర్నీలో పెట్రోలియం స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహించింది. గతేడాది కామన్వెల్త్‌ గేమ్స్‌ తర్వాత గాయాలబారిన పడ్డ రుత్విక ఇటీవలే కోలుకొని పునరాగమనం చేసింది. మహిళల డబుల్స్‌లో బండి సాహితి (తెలంగాణ)–నీల (తమిళనాడు) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో సాహితి–నీల జోడీ 12–21, 17–21తో టాప్‌ సీడ్‌ శిఖా గౌతమ్‌ (ఎయిరిండియా)–అశ్విని భట్‌ (కర్ణాటక) జంట చేతిలో ఓడిపోయింది.

మరిన్ని వార్తలు