మీ ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని ఆశిస్తున్నా: విజయశాంతి ట్వీట్

7 Dec, 2023 16:46 IST|Sakshi

రాజకీయాలతో బిజీగా ఉన్న రాములమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల గుడ్‌ బై చెప్పి పాలిటిక్స్‌లో వెళ్లి విజయశాంతి మళ్లీ పెద్దగా కనిపించలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి ప్రచారం చేశారు. గతంలో బీజేపీలో ఉన్న ఆమె బయట ఎక్కడా పెద్దగా కనిపించలేదు. అయితే మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు రాములమ్మ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది. 

విజయశాంతి తన ట్వీట్‌లో రాస్తూ..' నన్ను తమ ప్రాణంగా భావిస్తూ జన్మంతా ఎన్నడూ నా వెన్నంటి ఉంటూనే ఉన్న నా అభిమాన దైవాలకు ఎన్నటికీ తీర్చుకోలేని కృతజ్ఞతతో మీ కోసం.... నిజం చెప్పాలంటే మీ అభిమానం కోసం నేను మళ్లీ ఒక సినిమా చేస్తున్నాను కావచ్చు.. 5 దశాబ్ధాల ఈ నా సినీ ప్రయాణంలో మీ దీవెనలు  ఎప్పటికీ ఉంటాయి. 1979 నుంచి నేటి వరకు ఉన్నట్లు.. మీ విజయశాంతి కళాకారిణిగా ఉన్నంతవరకు ఎప్పటికీ అట్లనే ఉంటాయని  విశ్వసిస్తున్నా' అంటూ రాసుకొచ్చారు.

ఈ సందర్భంగా నందమూరి కల్యాణ్ రామ్, దర్శకుడు ప్రదీప్ చిలుకూరికి అభినందనలు అంటూ పోస్ట్ చేసింది. దీంతో విజయశాంతిని వెండితెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. విజయశాంతి చివరిసారిగా 2020లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో విడుదలైన చిత్రం సరిలేరు నీకెవ్వరులో కనిపించింది. ఈ చిత్రంలో మహేష్ బాబు, రష్మికా మందన్న, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు.

>
మరిన్ని వార్తలు