నివేదిక వచ్చాకే షమీపై నిర్ణయం: శుక్లా  

22 Mar, 2018 01:09 IST|Sakshi

ముంబై: అవినీతి నిరోధక విభాగం నుంచి నివేదిక వచ్చాక పేసర్‌ షమీపై తుది నిర్ణయం తీసుకుంటామని ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా వెల్లడించారు. పాకిస్తానీ స్నేహితురాలికి, భారత పేసర్‌కు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అతని భార్య హసీన్‌ జహాన్‌ ఆరోపించింది. దీంతో బీసీసీఐ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోణంలో దర్యాప్తుకు ఆదేశించింది. ఏసీయూ చీఫ్‌ నీరజ్‌ కుమార్‌కు విచారణ బాధ్యతను అప్పగించింది. అతని నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, వచ్చిన వెంటనే షమీ ఐపీఎల్‌ ఆడటంపై, సెంట్రల్‌  కాంట్రాక్టు ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటామని శుక్లా తెలిపారు.

లీగ్‌కు సంబంధించిన స్పాన్సర్‌షిప్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ సీజన్‌లో అంపైర్‌ నిర్ణయ సమీక్షా పద్ధతిని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇన్నింగ్స్‌కు ఒకసారి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. 

మరిన్ని వార్తలు