దటీజ్‌ కోహ్లి!

3 Aug, 2018 10:18 IST|Sakshi
సెంచరీ అనంతరం కోహ్లి

సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసల జల్లు

బర్మింగ్‌హామ్‌ : ఇంగ్లండ్‌ గడ్డపై చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ... గత పర్యటన నాటి ఆటగాడిని కానని నిరూపిస్తూ... టెయిలండర్ల సాయంతో ఒంటిరి పోరాటం చేస్తూ సెంచరీతో ఆకట్టుకున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అటు టీమిండియా దిగ్గజ ఆటగాళ్ల నుంచి సాధారణ క్రికెట్‌ అభిమాని వరకు కోహ్లిని కొనియాడక ఉండలేకపోతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ‘దటీజ్‌ కోహ్లి’ అంటూ తమ అభిమాన క్రికెటర్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 

‘అత్యంత కీలకమైన సమయంలో నీ పోరాటం అమోఘం.. ఈ అద్భుత సెంచరీ సాధించిన నీకు అభినందనలు..ఈ టెస్ట్‌ సిరీస్‌ను గొప్పగా ఆరంభించారు’ -సచిన్‌ టెండూల్కర్‌

‘కోహ్లి నుంచి అద్భుత సెంచరీ. 2014లో అతని 10 ఇన్నింగ్స్‌లో సాధించిన పరుగులను ఈ సిరీస్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో సాధించాడు. షమీ, ఇషాంత్‌, యాదవ్‌లతో 99 పరుగులు జతవ్వగా.. వారి స్కోర్‌ 8 పరుగులే కాగా.. మిగతావన్నీ కోహ్లియే సాధించడం అద్భుతం’- వీరేంద్ర సెహ్వాగ్‌

‘వాట్‌ ఏ ప్లేయర్‌.. ఒంటి చేత్తో మ్యాచ్‌ను శాసించాడు. కోహ్లి కెరీర్‌లోనే ఇది ఓ గొప్ప సెంచరీ. ఇదో గొప్ప ఇన్నింగ్స్‌’-మహ్మద్‌ కైఫ్‌

‘కోహ్లి..సెన్సెషన్‌ల్‌ బ్యాటింగ్‌.. సిరీస్‌కు గొప్ప ఆరంభం’- సురేశ్‌ రైనా

‘నా కల నిజమైంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఆ సందర్భం నన్ను కనువిందు చేసింది. కోహ్లి సెంచరీ సాధించగా.. మ్యాచ్‌కు హాజరైన అనుష్కశర్మ స్టాండ్స్‌లో నుంచి నిలబడి చప్పట్లు కొడుతూ అభినందిస్తుంటే.. కోహ్లి తమ వెడ్డింగ్‌ రింగ్‌ చూపిస్తూ ఫ్లయింగ్‌ కిస్‌ ఇవ్వడం ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిపోయింది’- ఓ అభిమాని 

ఇంగ్లండ్‌ గడ్డపై జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. ఇది కోహ్లికి ఇంగ్లండ్‌ గడ్డపై తొలి టెస్ట్‌ సెంచరీ కాగా.. కెరీర్‌లో 22వ సెంచరీ. భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ అంతా కుప్పకూలిన టెయిలండర్ల సాయంతో కోహ్లి పోరాడాడు. దీంతో భారత్‌ 274 పరుగులు చేయగలిగింది.

చదవండి: 'సర్‌' విరాట్‌

మరిన్ని వార్తలు