సురక్ష బ్యాండ్‌తో లైంగిక వేధింపులకు చెక్‌

13 Jan, 2018 07:43 IST|Sakshi

మహిళలకు సేఫ్టీబ్యాండ్స్‌ అందించనున్న బీబీఎంపీ

నేరాల అదుపునకు ప్రత్యేక పరికరం

ఒక్కసారి మీట నొక్కితే చాలు పోలీసులకు, బంధువులకు సమాచారం

మహిళల రక్షణకు నిర్భయ లాంటి చట్టాలు చేసినా నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఏదో ఒకచోట మహిళలు దాడులకు బలైపోతూనే ఉన్నారు. అలాంటి వాటికి చెక్‌ పెట్టడానికి సేఫ్‌ సిటీ ప్రణాళికలో భాగంగా బెంగళూరు మహా నగర పాలికె సురక్ష బ్యాండ్‌లను అందించనుంది. జీపీఎస్‌ ఆధారిత ఈ బ్యాండ్లు మహిళలకు సబ్సిడీ ధరతో అందజేయనుంది.   

సాక్షి,బెంగళూరు: బెంగళూరు నగరంలో మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న లైంగిక వేధింపులు, దౌర్జన్యాల ఘటనలు అరికట్టడానికి పాలికె సరికొత్త సాంకేతిక రక్షణాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టే ఉద్దేశంతో రూపొందించిన సేఫ్‌సిటీ ప్రణాళికలో భాగంగా మహిళల భధ్రత కోసం తీసుకోనున్న చర్యలపై బీబీఎంపీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందించింది. అందులో భాగంగా నగరవ్యాప్తంగా మహిళలు, యువతులకు జీపీఎస్‌ ఆధారిత సురక్ష బ్యాండ్‌లను అందించడానికి నిర్ణయించుకున్నట్లు కేంద్రానికి అందించిన నివేదికలో పేర్కొంది.

ఈ ప్రణాళిక అమలుకోసం పాలికె రూ.100 కోట్ల నిధులు కేటాయించాలంటూ నివేదికలో విన్నవించింది. మహిళల భధ్రత కోసం తీసుకోనున్న చర్యలు, అనుసరించిన ప్రణాళికలపై చర్చించి తమకు నివేదికలు అందించాలంటూ కొద్ది నెలల క్రితం దేశంలోని ప్రముఖ నగరాల పాలనా సంస్థలకు కేంద్రప్రభుత్వం సూచనలు జారీ చేసింది. నివేదికలు అందించిన అనంతరం నిర్భయ నిధుల పథకం ద్వారా ఆయా నగరాల్లో మహిళల భద్రత కోసం నిధులు కేటాయిస్తామంటూ కేంద్రప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం ఇటీవల సమావేశమైన నగర పోలీసులు, పాలికె అధికారులు సురక్ష బ్యాండ్‌లను అందించడానికి నిర్ణయించుకొని ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో ప్రస్తావించారు.

ఎలా పనిచేస్తుంది...
పాలికె అందించనున్న సురక్ష బ్యాండ్‌లను జీపీఎస్‌తో అనుసంధానం చేయనున్నారు.« మహిళలు, యువతులు ధరించనున్న సురక్ష బ్యాండ్‌లలో ఆయా మహిళల, యువతుల కుటుంబ సభ్యులు, స్థానిక పోలీస్‌స్టేషన్‌లు తదితర ఏడు ఫోన్‌ నంబర్లు నమోదు చేయనున్నారు. ఏదైనా ఆపద తలెత్తిన సమయంలో వెంటనే సురక్ష బ్యాండ్‌ ద్వారా యువతులు కుటుంబ సభ్యులతో పాటు బ్యాండ్‌లో పొందుపరచిన ఏడు నంబర్లకు ఒకేసారి ప్రస్తుతం తామున్న ప్రదేశం, ఆపద గురించి సమాచారం చేరవేయవచ్చు. జీపీఎస్‌ ద్వారా పోలీసులు, కుటుంబ సభ్యులు వెంటనే యువతులు ఉన్న చోటుకు చేరుకోవడానికి ఈ సురక్ష బ్యాండ్‌లు ఎంతో సహకరించనున్నాయి.

ధరల్లో సబ్సిడీ : మహిళల భధ్రత కోసం అందుబాటులోకి తేనున్న సురక్ష బ్యాండ్‌లను పాలికె సబ్సిడీ ధరల్లో మహిళలకు విక్రయించడాని కి నిర్ణయించుకుంది. ఒక్కో బ్యాండ్‌ తయారికీ రూ.800 ఖర్చు కానుండగా మహిళలకు రూ.400లకే విక్రయించడానికి పాలికె నిర్ణయించుకుంది. ప్రయోగాత్మకంగా పాలికె పరిధిలో పది లక్ష ల మంది మహిళలకు సురక్ష బ్యాండ్‌లు అందించనుంది.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పండితుడి జోస్యం.. మూడోపెళ్లిపై వ్యామోహం!

కర్ణాటక అసెంబ్లీ మ.3గంటల వరకూ వాయిదా

ఒంటి నిండా బంగారంతో గుళ్లోకి వచ్చి..

భర్త ఆత్మహత్య : ముగ్గురు పెళ్లాల ఘర్షణ

కోడలికి కొత్త జీవితం

తమిళ హిజ్రాకు కీలక పదవి

ఫలించిన ట్రబుల్‌ షూటర్‌ చర్చలు

రెబల్‌ ఎమ్మెల్యే నాగరాజ్‌తో మంతనాలు

పెళ్లిళ్లను కాటేస్తున్న కుల తేడాలు

ఆ బాలుడిని పాఠశాలలో చేర్చుకోండి

కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన టిక్‌టాక్‌

నిరాడంబరంగా న్యాయవాది నందిని పెళ్లి

విద్యార్హతలు ఎక్కువగా ఉంటే ఉద్యోగాలకు అనర్హులే!

రోమియో టీచర్‌

కలెక్టర్‌కు కటకటాలు 

‘ఆ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటారు’

కర్ణాటకలో ఏం జరగబోతోంది?

రామలింగారెడ్డితో కుమారస్వామి మంతనాలు

బళ్లారి ముద్దుబిడ్డ వైఎస్సార్‌

వేలూరులో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

కుమారస్వామి రాజీనామా చేస్తారా? 

ఎమ్మెల్యేల రాజీనామాలకు ఈ నాలుగే కారణమా? 

మీరు మనుషులేనా? ఎక్కడేమి అడగాలో తెలియదా?

పాముతో వీరోచితంగా పోరాడి..

హైదరాబాద్‌ బిర్యానీ ఎంతపని చేసింది?

అసెంబ్లీలోకి నిమ్మకాయ నిషిద్ధం

మాంగల్య బలం

పరోటా గొంతులో చిక్కుకుని నవ వరుడు మృతి

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వనిత కూతురు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’