10 నుంచి సీఎం దుబాయ్ పర్యటన

6 Dec, 2016 01:44 IST|Sakshi
10 నుంచి సీఎం దుబాయ్ పర్యటన

సీఎంతోపాటు మంత్రులు, అధికారులు కూడా..

 సాక్షి, అమరావతి: ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుబాయ్, అబుదాబీ, కువైట్ నగరాల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రులు, అధికారులు కూడా పర్యటనకు వెళ్లనున్నారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎంవో అధికారులు జి.సారుుప్రసాద్, రాజమౌళి, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, పరిశ్రమల శాఖ కార్యద్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, ఐటీ శాఖ కార్యదర్శి కె.విజయానంద్, ఆర్థిక మండలి సీఈవో జాస్తి కృష్ణ కిశోర్, ఆర్థిక మండలికి చెందిన ఇద్దరు కన్సల్టెంట్లు, సీఐఐ ప్రతినిధి ఈ పర్యటనకు వెళ్లనున్నారు.

 పోలవరం కాంక్రీట్ పనులకు 19న శంకుస్ధాపన: పోలవరం కాంక్రీట్ పనులకు ఈ నెల 19వ తేదీన శంకుస్థాపన చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణరుుంచారు. కార్యక్రమానికి కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి, ఇతర ప్రముఖులను ఆహ్వానించాలని ఆధికారులను ఆదేశించారు.సోమవారం వెలగపూడి సచివాల యంలోని తన కార్యాలయంలో పోలవరం పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు.

 బ్యాంకర్లతో సీఎం టెలీకాన్ఫరెన్‌‌స: సోమ, మంగళ, బుధవారాల్లో బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ అధికంగా ఉంటుందని.. రైతులు, చేతివృత్తులవారు, పెన్షనర్లు ఇబ్బందులు పడకుండా చూడాలని సీఎం చంద్రబాబు బ్యాంకర్లను కోరారు. వారికి కనీస వసతులు కల్పించాలని సూచించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు.

 ఆర్టీసీకీ ఓ కన్సల్టెన్సీ!: ఆర్థిక వ్యవహారాల్లో ఆరితేరిన ఒక సలహా సంప్రదింపుల సంస్థ (కన్సల్టెన్సీ)ను నియమించుకోవడం ద్వారా నష్టాల నుంచి బయటపడే మార్గాలు అన్వేషించాలని రోడ్డు రవాణా సంస్థకు సీఎం చంద్రబాబు సూచించారు. సంస్థకు ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి రూ.1,050 కోట్ల హడ్కో రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే అంశం పరిశీలిస్తామన్నారు సోమవారం రాత్రి రవాణా మంత్రి శిద్ధా రాఘవరావుతో కలసి ఆర్టీసీ పనితీరును ఆయన సమీక్షించారు.

మరిన్ని వార్తలు