Japan Twitter Review : ‘జపాన్‌’ ట్విటర్‌ రివ్యూ

10 Nov, 2023 06:50 IST|Sakshi

విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ తమిళ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో కార్తి. కథలో కొత్తదనం..పాత్రలో వైవిధ్యం ఉండే చిత్రాల్లోనే నటిస్తాడు. అందుకే నటుడిగా కెరీర్‌ ప్రారంభించి దాదాపు 20 ఏళ్లు అవుతున్నా..ఇప్పటికి కేవలం 24 చిత్రాలను మాత్రమే పూర్తి చేశాడు. ఆయన హీరోగా నటించిన 25వ చిత్రం ‘జపాన్‌’.  

జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టాలీవుడ్‌లో కూడా ప్రమోషన్స్‌ గట్టిగా చేయడంతో ‘జపాన్‌’పై ఇక్కడ కూడా భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా నేడు(నవంబర్‌ 10) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. జపాన్‌ మూవీ ఎలా ఉంది? స్టోరీ ఏంటి? తదితర విషయాలు  ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.

‘జపాన్‌’ చిత్రానికి ఎక్స్‌లో మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ చిత్రం బాగుందని కొంతమంది చెబుతుంటే... మరికొంత మంది బాగోలేదని కామెంట్‌ చేస్తున్నారు. జపాన్‌ 

హీస్ట్ మూవీ జపాన్‌ను దర్శకుడు రాజ్ మురుగన్ అద్బుతంగా తీశాడు. ఫస్టాఫ్ యావరేజ్‌గా, సెకండాఫ్ టాప్ లేపింది. కార్తి తన పాత్రలో ఒదిగిపోయాడు. జీవీ ప్రకాశ్ సంగీతం సూపర్‌గా ఉంది. సినిమాటోగ్రఫి అదరగొట్టింది అని నెటిజన్ ట్వీట్‌ చేశాడు. 


జపాన్ క్రింజ్‌లా ఉందని, అట్టర్ ఫ్లాప్ మూవీ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

జపాన్ సినిమా హీస్ట్, క్యాట్- మౌస్ తరహాలో సాగే యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌. ఇందులో రొమాన్స్, ఎమోషన్స్ మిక్స్ చేశారు. కార్తీ ఫెర్ఫార్మెన్స్‌తో ఎపిక్ ఎంటర్‌టైనర్‌గా మారింది. డైరెక్టర్ సీన్లను అద్బుతంగా తీశాడు. జీవీ ప్రకాశ్ మూవీ ఈ సినిమా హైలెట్ అంటూ 4 రేటింగ్‌ ఇచ్చారు ఓ నెటిజన్‌. 

మరిన్ని వార్తలు