జయేంద్ర సరస్వతి ఉక్కిరిబిక్కిరి

29 Mar, 2016 09:01 IST|Sakshi

చెన్నై: పదిహేనేళ్ల క్రితం చెన్నైలో జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడిగా కంచిమఠం పీఠాధిపతి జయేంద్ర సరస్వతి సోమవారం చెన్నై సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. వంద ప్రశ్నలతో రెండు గంటలపాటు జడ్జి.. కంచి పీఠాధిపతిని ఉక్కిరిబిక్కిరి చేశారు. సోమశేఖర్ ఘనాపాటి పేరుతో జయేంద్రపై ఆరోపణలతో తమిళనాడు ప్రభుత్వానికి ఆకాశరామన్న ఉత్తరాలు అందాయి. ఈ నేపథ్యంలో 2002 సెప్టెంబర్ 20న చెన్నై మందవల్లిలో నివసించే ఆడిటర్ రాధాకృష్ణన్  ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి మారణాయుధాలతో దాడిచేశారు. ఈ ఉత్తరాల వ్యవహారాన్ని రాధాకృష్ణనే నడిపించినట్లు భావించిన వారు దాడులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

మరిన్ని వార్తలు