ఆర్మీకి హ్యాట్సాఫ్..

30 Sep, 2016 02:48 IST|Sakshi
ఆర్మీకి హ్యాట్సాఫ్..

నియంత్రణ రేఖ ఆవల ఉగ్ర శిబిరాలపై దాడిచేసిన భారత సైన్యంపై ప్రశంసల జల్లు కురిసింది. పార్టీలకు అతీతంగా ప్రముఖులంతా సైనిక చర్యను స్వాగతించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా హర్షం వ్యక్తమైంది.

 ఇది తగిన బదులు: సోనియా
పాకిస్తాన్‌కు గట్టి సమాధానమిచ్చారు. ఉగ్ర వ్యతిరేక పోరులో ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉంటుం ది. సరిహద్దుల్లో  భారత్‌పై జరుగుతున్న  దాడులకు పాకిస్తాన్ బాధ్యత వహించాలి. 

 శాంతికి కలిసి రావాలి: వెంకయ్య
ఉగ్రవాదులతో అంటకాగడాన్ని మానుకోవాలని పాకిస్తాన్‌ను ఏనాటి నుంచో అభ్యర్థిస్తున్నాం. ఆ దేశ ప్రాయోజిత ఉగ్రవాదం కేవలం భారత్‌కే కాదు మొత్తం ప్రపంచానికే ముప్పుగా మారింది. ఇరు దేశాలు కలిసి కృషి చేస్తేనే శాంతి సాధ్యం. పాక్ ఇకనైనా తన బాధ్యతను గ్రహించాలి.

ముందు జాగ్రత్త చర్య: జైట్లీ
చొరబాట్లకు సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులపై సైనిక దాడి ముందు జాగ్రత్త చర్య. సైన్యం సాహసాల పట్ల గర్విస్తున్నాం.

మన శౌర్యానికి ప్రతీక: అమిత్‌షా
ఎల్‌ఓసీ ఆవల తీవ్రవాద స్థావరాలపై దాడులు ప్రధాని మోదీ నాయకత్వానికి, మన సైన్యం శౌర్యానికి ప్రతీకగా నిలుస్తాయి. ఉగ్రవాదులను ఓడించడం ద్వారా మోదీ ప్రభుత్వంలో ప్రజలు భద్రంగా ఉన్నారని భావిస్తున్నారు.

తప్పనిసరి అడుగు: జవదేకర్
ఈ దాడులు అత్యవసరమైన చర్య. ఎన్నో ఏళ్లు గా ఈ దిశగా అడుగులు పడలేదు. దేశమంతా ఈ చర్యను స్వాగతిస్తోంది. సింధూ నదీ జలాలపై కూడా ఏదో నిర్ణయం తీసుకోవాలి

చివరి అవకాశంగానే: రవిశంకర్‌ప్రసాద్
తమ గడ్డపై ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్‌కు చెబుతున్నా ప్రయోజనం లేకే తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ దాడులు చేయాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు