ఏసీ ఒక సైకో..

7 Oct, 2016 10:02 IST|Sakshi

దేవాదాయశాఖ ఉద్యోగుల డిమాండ్
 ఏసీపై బిగుస్తున్న ఉచ్చు
 సిబ్బందంతా మూకుమ్మడి సెలవులు
 టర్నర్ చౌల్టీ్ర వద్ద వంటావార్పుతో నిరసన
 కొత్త కమిషనర్‌ను నియమించే వరకు పోరాటం ఆగదని స్పష్టం

 
డాబాగార్డెన్‌‌: దేవాదాయశాఖ సహాయ కమిషనర్ ఇ.వి.పుష్పవర్థన్‌పై ఉచ్చు బిగుసుకుంటోంది. కార్యనిర్వహణాధికారులే కాదు.. ఆలయాల మేనేజర్లు, సిబ్బంది కూడా ఏసీ పై మండిపడతున్నారు. కార్యాలయంలో ఉన్న సిబ్బందంతా మాస్ లీవ్ పెట్టి మరీ కార్యనిర్వహణాధికారుల పోరాటంలో భాగస్వాములయ్యారు. ఈ మేరకు బుధవారం టర్నర్ చౌల్టీ్ర ప్రాంగణంలో దేవాదాయ శాఖ సిబ్బంది వంటా వార్పు కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారు.
 
నియంతగా వ్యవహరిస్తున్న ఏసీ డౌన్ డౌన్.. అంటూ నినాదాలు చేశారు. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తూ.. నిజారుుతీ ముసుగులో అవినీతి చేస్తున్న ఏసీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్యాలయానికి వస్తున్న ఉప కమిషనర్ ఎన్‌వీఎస్ మూర్తి వాహనాన్ని అడ్డుకుని ఏసీని వెంటనే బదిలీ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా ఉప కమిషనర్ మాట్లాడుతూ మీ డిమాండ్‌ను..మీరిచ్చిన వినతి పత్రాన్ని అధికారుల దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లినట్టు తెలిపారు.
 
ఏసీ ఒక సైకో..
 సహాయ కమిషనర్ ఒక సైకోల ప్రవర్తిస్తున్నాడని కార్యనిర్వాహణాధికారులు  ఆరోపించారు. అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతున్నారని, మహిళా ఉద్యోగినులకు పక్కన కూర్చొబెట్టుకుని వేధిస్తున్నారన్నారు. ఒక్కొక్కర్ని టార్గెట్ చేసి సస్పెన్‌‌స చేస్తానని బెదిరిస్తూ మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని వాపోయారు. ప్రేమసమాజానికి సంబంధించిన స్థల విషయంలో సారుుప్రియా రిసార్‌‌ట్స యాజమాన్యం వద్ద రూ.5లక్షలు అక్రమంగా తీసుకున్నారని ఆరోపించారు. 2014 ఆగస్టు ఒకటిన విధుల్లోకి చేరిన నాటి నుంచి నిరంకుశ ధోరణి సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎటువంటి ఆరోపణలు లేకుండా, విచారణ చేపట్టకుండా సిబ్బందిని డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారని దుయ్యబట్టారు. కొత్త సహాయ కమిషనర్‌ను నియమించే వరకూ సెలవులోనే కొనసాగుతామని హెచ్చరించారు.  
 
 నల్లబ్యాడ్జీలతో నిరసన..
 సహాయ కమిషనర్ ఇ.వి.పుష్పవర్థన్‌పై తక్షణ చర్యలు కోరుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగులు తలపెట్టిన సామూహిక సెలవులకు మద్దతుగా కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన ఉద్యోగుల సంక్షేమ సంఘం నల్ల బ్యాడ్జీలు ధరంచి సంఘీభావం తెలిపారు. మరో వైపు నిన్నమొన్నటి వరకు ఏసీకి అనుకూలంగా వ్యవహరించిన వారంతా ఉద్యమిస్తున్న ఉద్యోగులకు మద్దతు ప్రకటించడంతో ఏసీ ఏకాకిగా మిగిలారు.   
 
 నేటి నుంచి నిరాహారదీక్షలు..
 మాస్ లీవ్‌లో భాగంగా జిల్లా దేవాదాయశాఖ ఉద్యోగులు, ఆలయాల మేనేజర్లు, సిబ్బంది అందరూ గురువారం నుంచి నిరాహారదీక్షలకు దిగనున్నట్టు కార్యనిర్వహణాధికారుల సంఘం అధ్యక్షుడు అల్లు జగన్నాథం, కార్యదర్శి బండారు ప్రసాద్, సహాయ కార్యదర్శులు శ్రీనివాసరావు, ఎం.ఎల్.ఎన్.శాస్తి్ర, కార్యనిర్వహణాధికారులు కె.శిరీష, భానురాజా అధిక సంఖ్యలో ఈవోలు, ఆలయాల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు