ఎక్స్‌ప్రెస్‌వే వెంట మురికి కాలువ

30 May, 2014 23:02 IST|Sakshi
ఎక్స్‌ప్రెస్‌వే వెంట మురికి కాలువ

ఎన్‌హెచ్‌ఏఐకి డిజైన్ ఇచ్చిన ఎమ్‌సీజీ
గుర్గావ్: హీరోహోండా చౌక్ సమీపంలో నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)తో కలిసి గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎమ్‌సీజీ) మురికి కాలువల నిర్మాణం చేపట్టనుంది. ఇప్పటికే ఉన్న ఎన్‌హెచ్‌ఏఐ కాలువతోపాటుగా ఢి ల్లీ -గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ వే పొడవునా ఇది ఉంటుందని మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. దీనికోసం ఇప్పటికే హైవేస్ అథారిటీతో సమావేశం నిర్వహించిన మున్సిపల్ కార్పొరేషన్ అందుకోసం ఓ డిజైన్‌ను కూడా సమర్పించింది.

డిజైన్‌కు ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదం తెలపగానే నిర్మాణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే దీనికి 17 కోట్ల రూపాయల మేర ఖర్చువుతుందని అధికారులు భావిస్తున్నారు. ‘‘ఈ రంగంలో నిపుణులతో చర్చించిన తరువాతే డిజైన్ రూపొందించాం. అయితే రెండు భిన్నమైన ప్రణాళికలతో మేం సిద్ధం చేశాం. ఒకటి హీరో హోండా చౌక్ దగ్గరది కాగా... మరొకటి హీరోహోండా చౌక్ నుంచి ఖస్త్రర్కీ దౌలా వరకు. అయితే మొదటి ప్రణాళికకు 17 కోట్ల రూపాయల ఖర్చవుతుంది.

దీనిని ఇప్పటికే ఎన్‌హెచ్‌ఏఐకి అందజేశాం. దానికి ఆమోదముద్ర పడగానే టెండర్లను పిలిచి నిర్మాణం పనులుమొదలు పెడతాం’ అని ఎమ్‌సీజీ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అయితే ఈ ఖర్చులోని కొంత భాగాన్ని ఎన్‌హెచ్‌ఏఐ పంచుకుంటుందని ఎమ్‌సీజీ ఆశిస్తోం ది. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులు కొంత భాగాన్ని పంచుకోమని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను కోరతామని, ఒకవేళ వారు అందుకు అంగీకరించకపోతే మొత్తం ఖర్చును తామే భరిస్తామని ప్రవీణ్ కుమార్ చెప్పారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతంలో మురి కినీటిని డీజిల్‌తో నడిచే పంపుల ద్వారా ఎమ్‌సీజీ తొలగిస్తోంది.

డీజిల్  పంపుల ఆపరేటర్లు తరచూ డీజిల్‌ను దొంగతనం చేస్తుండటం వల్ల ఈ పద్ధతి విజయవంతం కావడం లేదని కమిషనర్ అంటున్నారు. ఈ వర్షాకాలానికల్లా కాలువ నిర్మాణం పూర్తి కాదని, వచ్చే ఏడాదికల్లానయినా అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. అయితే కాలువ నిర్మాణం కోసం రోడ్డుకిరుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించనున్నారు. ప్రస్తుతం ఉన్న డిజైన్‌కు ఎంతమేర స్థలం అవసరమవుతుందో గుర్తించే పనిలో  ఉన్నామని, హీరోహోండా చౌక్ సమీపంలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొల గిస్తామని, ఒకవేళ డిజైన్‌కు ఆమోదం రాకపోతే మరో డిజైన్‌ను ఎన్‌హెచ్‌ఏఐకి సమర్పిస్తామని గుర్గావ్ మున్సిపల్ అధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు