Moushumi Chatterjee: 10 ఏళ్లకే ఫుల్‌ క్రేజ్‌.. 17 ఏళ్లకే తల్లయిన స్టార్‌ హీరోయిన్‌.. అర్ధాంతరంగా ముగిసిన కెరీర్‌..

9 Nov, 2023 14:59 IST|Sakshi

మనం ఎన్నో అనుకుంటాం. కానీ అందులో కొన్నే అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. విధి రాసిన స్క్రిప్ట్‌ ప్రకారమే జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో జయాపజయాలు, కష్టసుఖాలు, ఒడిదుడుకులు.. ఇలా ఎన్నింటినో అనుభవించి తీరాల్సిందే! ఇప్పుడు చెప్పుకునే హీరోయిన్‌ సక్సెస్‌ అంటే తెలియని వయసులోనే ఘన విజయాన్ని అందుకుంది. చదువుకునే వయసులో తల్లిగా మారింది. ఆ తర్వాత దశాబ్దం పాటు హిందీ, బెంగాలీ ఇండస్ట్రీని ఏలింది. ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉంటోంది. ఇంతకీ ఆమె ఎవరు? తన కెరీర్‌ ఎందుకు ముగిసిపోయింది? అనేది ఈ కథనంలో చదివేద్దాం..

బాలికా బధు.. బెంగాలీ హిట్‌ మూవీ
బాల్య వివాహాలు.. ఇప్పుడంటే తగ్గుముఖం పట్టాయి కానీ గతంలో విచ్చలవిడిగా జరిగేవి. ఈ వ్యవస్థ తీరును ఎండగడుతూ బాలికా బధు అని 1967లో ఓ బెంగాలీ సినిమా‌ వచ్చింది. ఈ సినిమా బెంగాల్‌లో 75 వారాలకు పైగా ఆడి ప్లాటినం జూబ్లీ చేసుకుంది. ఇందులో నటించిన చిన్నారి బాలిక పేరు ఇందిర. స్క్రీన్‌ పేరు మౌసమి. ఈ సినిమా విశేష ఆదరణ పొందడంతో ఆ చిన్నారి పేరు మౌసమిగానే స్థిరపడిపోయింది. అప్పటికి ఆమె వయసు 10 ఏళ్లు. తనకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ ముందు చదువు పూర్తి చేయాలన్నది ఆమె తపన.

ఆమె చివరి కోరిక.. చదువుకునే వయసులో..
అయితే ఆమె పదో తరగతి చదివే సమయంలో మౌసమి తండ్రి అక్క క్యాన్సర్‌తో చివరి స్టేజీలో ఉంది. తన పెళ్లి చూడాలన్నది ఆమె చివరి కల. ఆమె కోసం పదో తరగతి పరీక్షలు కూడా త్యాగం చేసింది. సంగీత దర్శకుడు, సింగర్‌ హేమంత్‌ రావు తనయుడు, నటుడు జయంత్‌ ముఖర్జీతో మౌసమి పెళ్లి జరిగింది. 15 ఏళ్లకే పెళ్లి చేసుకున్న ఆమె 17 ఏళ్లకే తల్లయింది. అత్తింటి ప్రోత్సాహంతో సినిమాల్లో అడుగుపెట్టింది. 1972లో అనురాగ్‌ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ సక్సెస్‌తో పాటు అవార్డులు తెచ్చిపెట్టింది.

అడ్జస్ట్‌మెంట్‌కు ఓకేనా?
వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయిన మౌసమీకి పట్టిందల్లా బంగారమే అయింది. పదేళ్లకు పైగా హిందీ తెరను ఏలింది. కథానాయికగా ఓ పదిహేనేళ్లు చేసిన తర్వాత, సహాయ పాత్రలు చేసుకుంటూ పోయింది. అయితే అందరిలాగే తను కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొంది. అడ్జస్ట్‌మెంట్‌కు ఓకే అంటేనే సినిమా అవకాశాలిస్తామంటే కన్నెత్తి కూడా చూడలేదు. అలా కొన్ని హిట్‌ సినిమాలను వదిలేసుకుంది. ఇలా తన యాటిట్యూడ్‌ వల్ల చాలా సినిమాల నుంచి తీసేసారిన స్వయంగా మౌసమీయే చెప్పుకొచ్చింది. ఆమె చివరగా 2015లో వచ్చిన పీకూలో సినిమాలో నటించింది. ఆ తర్వాత వెండితెరపై కనిపించనేలేదు.

చదవండి:గిన్నిస్‌ రికార్డు.. ఆయనే నా సూపర్‌ హీరో అంటున్న సుమ

మరిన్ని వార్తలు