తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

27 Sep, 2016 10:58 IST|Sakshi
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

విశాఖపట్నం : విదర్భ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్పై అల్పపీడనం కొనసాగుతుందని విశాఖలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడతాయని... దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. అలాగే తెలంగాణలోనూ వర్షాలు పడతాయని కానీ కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పింది.

మరిన్ని వార్తలు