మకరసంక్రాంతికి సెలవు లేదు

10 Jan, 2018 08:36 IST|Sakshi
చైతన్య ఆంధ్రసాహితీ సంస్కృతి సమితి కార్యదర్శి కృష్ణమూర్తి మాస్టారు

ఆందోళనలో తెలుగు ప్రజలు

ఎలిమెంటరీ డీడీకి వినతిపత్రం

పర్లాకిమిడి: తెలుగు వారి పెద్ద పండగ మకరసంక్రాంతినాడు ఒడిశా ప్రభుత్వం సెలవు ప్రకటించనందుకు రాష్ట్రంలోని తెలుగు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించనందుకు నిరసనగా స్థానిక చైతన్య ఆంధ్రసాహితీ సంంస్కృతి సమితి కార్యదర్శి, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య కార్యవర్గసభ్యులు పి.కృష్ణమూర్తి మాస్టారు భువనేశ్వర్‌లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అరుణ కుమారి సేనపతిని కలిసి సోమవారం ఒక వినతిపత్రాన్ని అందజేశారు. కనీసం ఆప్షనల్‌ సెలవు కూడా క్యాలెండర్‌లో లేదు. మకర సంక్రాంతి ఆదివారం అని  పేర్కొంటూ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవును మంజూరు చేయలేదు.

కటక్‌ నుంచి కొరాపుట్‌ జిల్లా వరకూ 80 లక్షలమంది జనాభా కలిగిన ఒడిశా రాష్ట్రంలో తెలుగు ప్రజలకు ముఖ్యమైన పండగ మకర సంక్రాంతి 15వతేదీ సోమవారం పడుతోంది. అనేక తెలుగు సంస్థలు ఉన్నాయి. రాయగడ జిల్లా నుంచి రాజ్యసభ ఎంపీగా నెక్కంటి భాస్కర రావు, కళ్లికోట్‌ ఎమ్మెల్యే, బీజేడీ నేత సుజ్ఞాణి దేవి, రాష్ట్రమంత్రిగా చీకిటి నియోజికవర్గం నుంచి ఉషారాణి దేవి వంటివారు ప్రతిని«ధులుగా ఉన్నారు. ఈ విషయమై రాష్ట్ర ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ డిప్యూటీ డీఈఓ ప్రశాంత కుమార్‌ జెనాను కృష్ణమూర్తి మాస్టారు కలిసి వినతిపత్రం అందజేసి వివరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. గజపతి జిల్లాలోని మాస్టార్లు అందరూ స్థానిక డీఈఓ, ఇన్‌స్పెక్టర్లకు సంక్రాంతి పండగ విశిష్టతపై తెలియజేయాల్సిందిగా ఆయన కోరుతున్నారు. కాగా మకర సంక్రాంతికి ప్రభుత్వం సెలవును తీసివేసి 12 ఏళ్లకు పైగానే అయింది.

మరిన్ని వార్తలు