చోరీ కేసులో వైద్య విద్యార్థుల అరెస్ట్

14 Feb, 2014 00:52 IST|Sakshi

టీనగర్, న్యూస్‌లైన్:కాంచీపురంలోని పారిశ్రామిక వేత్త ఇంట్లో నగలను చోరీ చేసిన వైద్య విద్యార్థిని, ఆమె స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. విద్యా ఫీజులు, ఉల్లాస జీవితం కోసం ఈ చోరీకి పాల్పడినట్లు నిందితులు తెలిపారు. కాంచీపురం మునుసామి మొదలియార్ అవెన్యూలో నివసిస్తున్న పారిశ్రామిక వేత్త ంటిలో ఇటీవల ఇంటి లాకర్‌లోని 135 సవర్ల బంగారు నగలు చోరీకి గురైన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలావుండగా జయకుమార్ ఇంటిపై అంతస్తులో ఉంటున్న ఈరోడ్ జిల్లా, భవానికి చెందిన గోవింద రాజన్ కుమార్తె సౌమ్య(వైద్య విద్యార్థిని) వద్ద పోలీసులు విచారణ జరిపారు. విచారణలో ఆమె తన స్నేహితుడు కృష్ణగిరి జిల్లా, పెద్దనపల్లికి చెందిన మణికంఠన్‌తో కలిసి చోరీకి పాల్పడినట్లు తెలిపింది. తాము ఇరువురం కాంచీపురం సమీపంలోగల వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నామని, విద్యా ఫీజులు కోసం, విలాస జీవితం కోసం ఈ చోరీ చేసినట్లు పేర్కొన్నారు. ఇద్దరినీ పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచి జైలులో నిర్బంధించారు.  

మరిన్ని వార్తలు