డెంగీతో చనిపోతున్నా చలనం లేదా?

31 Oct, 2016 16:13 IST|Sakshi
ఖమ్మం: డెంగీ జ్వరాలతో ప్రజలు చనిపోతున్నా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చలనం లేకుండా వ్యవహరిస్తోందని టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 21మంది డెంగీతో మృతిచెందినా మంత్రులకు వారి కుటుంబాలను పరామర్శించే తీరిక లేకుండా పోయిందన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, చికిత్సకు అయిన ఖర్చును సీఎం సహాయ నిధి నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో చనిపోయిన వారి కుటుంబీకులకు రూ. 25వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. డెంగీ జ్వరాలు అదుపులోకి వచ్చేదాకా సంబంధిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని వెంకట వీరయ్య డిమాండ్ చేశారు.
మరిన్ని వార్తలు