మాయలో ఇద్దరిగా...

3 Mar, 2015 03:03 IST|Sakshi
మాయలో ఇద్దరిగా...

 నయన సంచలన తారే కాదు...క్రేజీ బిజీ తార కూడా. రెండు సార్లు ప్రేమ బెడిసి కొట్టినా... రెండేళ్లు నటనకు దూరంగా ఉన్నా ...తాజాగా మళ్లీ పూర్వ వైభవం సాధించుకున్న నాయకి నయనతార. తమిళంలో నెంబర్ ఒన్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న ఈ భామ చాలా గ్యాప్ తర్వాత సొంత గడ్డపై మోహన్‌లాల్‌తో జతకడుతున్నారు. కాగా, టాలీవుడ్‌లోని ఒక భారీ అవకాశం ఈ బ్యూటీ కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం తమిళంలో సూర్యతో మాస్, ఉదయనిధి స్టాలిన్ సరసన నన్బెండా... విజయ్ సేతుపతితో నానుం..రౌడీదాన్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.
 
 కాగా, మాజీ ప్రియుడు శింబుతో లవ్ పెయిల్యూర్ తర్వాత నటిస్తున్న ఇదు నమ్మ ఆలు చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. వీటితో పాటుగా నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మాయ. ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేయడం విశేషం. అంతే కాదు, ఓ పాత్రలో తల్లిగా నటిస్తున్నారు. ఇది హర్రర్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈమె హర్రర్ చిత్రంలో నటించడం, ద్విపాత్రాభినయం చేయడం ఇదే తొలి సారి అన్నది గమనార్హం. కాగా, ఈ చిత్రం తమిళంతో పాటుగా తెలుగు, మలయాళంలో మయూర్‌పేరుతో ఏక కాలంలో సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో తెరమీదకు రానున్నది.
 

మరిన్ని వార్తలు