సీఎం నియోజకవర్గంలో పాత కరెన్సీ కలకలం

23 Mar, 2017 16:19 IST|Sakshi
సీఎం నియోజకవర్గంలో పాత కరెన్సీ కలకలం

చెన్నై(కేకే.నగర్‌):
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సొంత నియోజకవర్గమైన ఇడైపాడిలో 10 లక్షల రూపాయలకు పైగా పాత రూ.500, 1000 నోట్లు ముక్కలు ముక్కలుగా చింపి చెత్తకుప్పలో పడేసిన దృశ్యం అక్కడున్న ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇడైపాడి నుంచి కొంగనాపురం వెళ్లే రోడ్డుపై ప్రభుత్వ ఆసుపత్రి ఉంది.

ఈ ఆసుపత్రి ఎదురుగా చెత్తకుప్పలో పాత రూ.500, 1000ల కరెన్సీ చిన్న చిన్న ముక్కలుగా చింపి పడి ఉన్నాయి. అవన్నీ గాలికి కొట్టుకుని వెళ్లి దూరంగా పడుతూ ఉండగా ఆ మార్గంలో వెళుతున్న విద్యార్థులు ఆ నోట్లను తీసుకుని ఆశ్చర్యంగా చూశారు. చెత్తకుప్పలో మందుల వ్యర్థాలతో పాటు కరెన్సీ ముక్కలు ఉన్న సమాచారం ఆ ప్రాంతంలో దావానంలా వ్యాపించింది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలతో పాటు, పోలీసులు అక్కడకు వచ్చారు. ఈ విషయం ఆదాయపన్ను విభాగ అధికారులకు తెలిసింది. చెత్తకుప్పలో పడేసిన కరెన్సీ నోట్లు ముక్కల విలువ లక్షల రూపాయలు ఉండవచ్చని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు