శశికళపై పిటిషన్‌ కొట్టివేత

3 Apr, 2017 19:51 IST|Sakshi
శశికళపై పిటిషన్‌ కొట్టివేత

సాక్షి, బెంగళూరు: అన్నా డీఎంకే నాయకురాలు శశికళ నటరాజన్‌పై దాఖలైన పిటీషన్‌ను కర్నాటక హైకోర్టు కొట్టేసింది. శశికళను  బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం నుంచి తుమకూరులోని కేంద్ర కారాగారానికి తరలించాలని ట్రాఫిక్‌ రామస్వామి అనే చెన్నై సామాజిక కార్యకర్త పిటీషన్‌ దాఖలు చేశారు. అయితే అది తమ పరిధిలోకి రాదని కర్ణాటక హైకోర్టు తేల్చిచెప్పింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళతో పాటు ఇళవరసి, సుధాకరన్‌లు ఫిబ్రవరి 15 నుంచి స్థానిక పరప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే.

కొంతమంది తమిళనాడుకు చెందిన మంత్రులు, వారి అనుచరులు తరచుగా శశికళను కలుస్తున్నారని ట్రాఫిక్‌ రామస్వామి అనే చెన్నై సామాజిక కార్యకర్త కర్ణాటక హైకోర్టు దృష్టికి ఇటీవల తీసుకువచ్చారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల శశికళను తుమకూరు కేంద్ర కారాగానికి తరలించి తమిళనాడు నాయకులు ఆమెతో భేటీ కాకుండా ఆదేశించాలని పిటిషన్‌ వేశారు. ఈ కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.కే ముఖర్జీతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారిస్తూ ఈ విషయం తమ పరిధిలోకి రాదని కేసును కొట్టివేసింది. కాగా, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అరవింద్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు