‘ఖమ్మం ఘటనపై న్యాయవిచారణ జరపాలి’

6 May, 2017 16:54 IST|Sakshi
హైదరాబాద్‌: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రైతులు విధ్వంసం సృష్టించిన ఘటనపై న్యాయ విచారణ చేయించాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు. దీనిపై రాష్ట్ర మంత్రి హరీష్ రావును కలిశామన్నారు. ప్రభుత్వానికి సమగ్ర వ్యవసాయ, మార్కెటింగ్ విధానాలు లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఖమ్మం ఘటనకు సంబంధించి అరెస్టు చేసిన రైతులను బేషరతుగా విడుదల చేసి వారిపై పెట్టిన కేసులను కొట్టివేయాలని డిమాండ్‌ చేశారు. మార్కెట్‌ ధ్వంసం వెనక ఎవరు ఉన్నారు... మార్కెట్ ఎవరి చేతిలో ఉంది.. రైతుల వివరాలు సేకరిస్తే అసలు గుట్టు బయట పడుతుందని ఆయన తెలిపారు.
 
రాష్ట్రంలో రైతు పరిస్థితి అధ్వానంగా ఉండగా రాజకీయ లబ్ధికోసం బీజేపీ, టీఆర్‌ఎస్‌ దోబూచులాడుతున్నాయని ఆరోపించారు. పసుపు రైతుల పరిస్థితి దయనీయంగా తయారయిందని, వ్యాపారులు, దళారులు మధ్య రైతు నష్ట పోతున్నాడని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం, మార్కెట‍్లలో దిగువ స్థాయి అధికారులు వ్యాపారులతో లాలూచీ పడి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన నాగార్జునసాగర్‌ కాల్వల ఆధునీకరణ పనుల్లో లూటీ జరుగుతోందని విమర్శించారు. ఇసుక అక్రమ రవాణా కోసం గోదావరి నదిలో రోడ్డు వేశారని వెల్లడించారు. ఆస్పత్రుల్లో మరణాలపై మంత్రి లక్ష్మారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వీటన్నిటిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశానన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సింధుతో పెళ్లి చేయాలంటూ కలెక్టర్‌కు పిటిషన్‌

విహారం.. విషాదం

నిమజ్జనంలో అపశ్రుతి.. 6గురు చిన్నారుల మృతి

డీకే శివకుమార్‌కు మరో షాక్‌

ఆటో డ్రైవర్‌కు రూ. 47,500 జరిమానా

జలపాతాన్ని తలపించిన బిల్డింగ్‌!

చెన్నైలో తెలంగాణ ఆటగాళ్ల అరెస్ట్‌

హెల్మెట్‌ లేదంటూ కారు యజమానికి జరిమానా

చొక్కా కోసం కోర్టుకెళ్లాడు...

నడిగర్‌ సంఘానికి అనుకూలంగా తీర్పు

సోదరుడిని పరామర్శించిన రజనీకాంత్‌

తమిళనాడులో బాంబు పేలుడు, ఇద్దరు మృతి

కాపీ డే వీజీ సిద్దార్థ తండ్రి మృతి

పురుడు పోసిన మహిళా పోలీసులు

ఇప్పట్లో ఈ సమస్యకు పరిష్కారం ఉందా!

ఈడీ ముందుకు ఠాక్రే‌, ముంబైలో టెన్షన్‌

మాస్తిగుడి కేసు: ఐదుగురి అర్జీలు తిరస్కరణ

ఆడ శిశువును అమ్మబోయిన తల్లి

కరెంట్‌ షాక్‌తో ఐదుగురు విద్యార్థులు మృతి

తలైవా రాజకీయ తెరంగేట్రానికి ముహూర్తం..?

హెల్మెట్‌ ధరించకుంటే రూ.1000 జరిమానా

పెళ్లిళ్లకు వరద గండం

నళిని కుమార్తె ఇండియా రాకలో ఆలస్యం

ఆ వృద్ధ దంపతులకు ప్రభుత్వ పురస్కారం

సీఎం ప్రారంభించిన 50 రోజులకే...

వెయిట్‌ అండ్‌ సీ : రజనీకాంత్‌

చిరకాల స్వప్నం.. సివిల్స్‌లో విజేతను చేసింది

‘బిర్యానీ తినడానికి టైమ్‌ ఉంది కానీ..’

ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి రాఖీలు..

ప్రేమోన్మాదం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘గద్దలకొండ గణేష్‌’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌: ఇంటి సభ్యులందరికీ బిగ్‌ షాక్‌!

సెంట్రల్‌ జైల్లో..

గద్దలకొండ గణేశ్‌

స్టార్స్‌ సీక్రెట్స్‌ బయటపెడతాను

మాట కోసం..