'ఈ సంకెళ్లే రేపు కేసీఆర్‌కు వేస్తారు'

12 May, 2017 14:33 IST|Sakshi
హైదరాబాద్‌: ఖమ్మం మార్కెట్‌ లో ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా మార్కెట్‌ శాఖ మంత్రిగానీ, జిల్లా మంత్రిగానీ మార్కెట్‌ను రాకపోవడం ఆశ్ఛర్యకరమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆయనిక్కడ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఖమ్మంలో రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈరోజు రైతుకు వేసిన సంకెళ్లే.. రాబోయే రోజుల్లో ప్రజలు కేసీఆర్‌ కు వేస్తారన్నారు.
 
వరి పంటకు రూ. 2 వేలు, మొక్కజొన్నకు రూ. 2 వేలు, పసుపు, పత్తి రూ.10 వేల చొప్పున మద్దతు ధర ప్రకటించాలన్నారు. ప్రగతి భవన్‌లో బుల్లెట్‌ ఫ్రూఫ్‌ గదుల్లో కేసీఆర్‌ నీరో చక్రవర్తిలా నిద్రపోతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రాజెక్టులకు అడ్డమని మరోసారి అంటే హరీష్‌రావు నాలుక కోస్తామని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో పెద్ద అబద్ధాల పుస్తకం.. పెద్ద ఒక్క హామీ కూడా నెరవేరలేదన్నారు. రైతులపై పెట్టిన కేసులను బేషరుతుగా ఉపసంహరించుకోవాలని పొన్నం డిమాండ్‌ చేశారు.
మరిన్ని వార్తలు