‘పోస్ట్’ పోయే.. ఫోన్ వచ్చే..

7 Aug, 2015 02:21 IST|Sakshi

 అనంతపురం కల్చరల్: ‘‘పోస్ట్... అంటూ వినిపించే మధుర కంఠం గురించి ఆసక్తిగా ఎదురు చూసే కాలం దాదాపుగా మరుగున పడిపోయింది. మారుతున్న కాలగమనంలో అందంగా ప్రవేశించిన మొబైల్ ఫోన్ మానవుని జీవితాన్ని సుఖమయం చేసింది. క్రమంగా తపాలా వ్యవస్థలోని పోస్టుకార్డుల వ్యవస్థ అంతర్థానమయ్యే స్థితికి చేరుకుంది. సమాచారాన్నందించడంలో అమోఘమైన పాత్ర పోషించిన పోస్ట్ కార్డు చిన్నబోతూ క్రమంగా పక్కకు తప్పుకుంటుంటే ఆ స్థానాన్ని మొబైల్ ఫోన్ భర్తీ చేస్తోంది.  
 
 150 ఏళ్ల పోస్టు కార్డు కుదేలు
 ఆంగ్లేయులు తపాలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్న తరుణంలోనే పోస్ట్‌కార్డు పుట్టింది. అణా నుంచి 50 పైసల వరకు సాగిన కార్డు ప్రస్థానం 150 ఏళ్లు దాటిన తరుణంలో, ‘సెల్’ దెబ్బకు కుదేలైంది. ఒకనాడు బంధువులను, స్నేహితులను పలకరిం చాలన్నా, ఉద్యోగాలకు ఇంట ర్వ్యూ లేఖలు పంపాలన్నా పోస్టు కార్డే వారధిగా ఉండేది. మధురమైన భావాలు మరిం త అందంగా చెప్పించడానికి కార్డు అవకాశం కల్పించేది. తిరిగి కార్డు వచ్చే వరకు ఎదురు చూడడమనేది అందమైన అనుభూతిగా మిగిలిపోయేది. ఫోన్ల రాకతో  తపాలా ప్రాధాన్యత తగ్గిపోయింది.  
 
 సెల్ వెంటనే అనారోగ్యం
 ప్రస్తుతం బిక్షగాడి నుంచి ధనికుల వరకు విద్యార్థుల నుంచి ఉన్నతోద్యోగుల వరకు అన్ని వర్గాల వారు, అన్ని రంగాల వారి చేతిలో మొబైల్ ఉంటుంది.  దీంతో ఇప్పుడు వారు ఒక గంట సెల్‌ఫోన్ విడిచి ఉండలేని పరిస్థితి నెలకొంది. సెల్‌తో ఎన్ని ఉపయోగాలున్నాయో.... అంత అనారోగ్యం దాని వెంటనే పొంచి ఉంది. ఈనాటి మొబైల్ ఫోన్లు పోస్టల్ జీవి తాన్ని కబళిస్తున్నా... ఆనాటి పోస్ట్‌కార్డు అందించే మధుర స్మృతులు ఇన్ని అన్ని గావు. దాచుకున్న ఆనాటి కార్డులను వీలున్నప్పుడు చదువుతుంటే పాత జ్ఞాపకాలు ఆనంద డో లికల్లో ముంచెత్తుతాయి. సెల్ ధ్వనులు లేని ప్రపం చం రావాలని చాలామం ది కోరుకుంటున్నారు.
 
 ‘సెల్’ ప్రపంచం
 80వ దశకంలో అడుగుపెట్టి సెల్ ప్రస్థానం, ఇప్పుడు విశ్వ వ్యాప్తమై సార్వజనీయమైంది. ఇప్పుడు సమాచారం పంపడం ఎంత తేలికంటే అనంతలో ఉన్నా అమెరికాలో ఉన్నా క్షణాల్లోనే. సెల్‌తో పాటు నెట్, ఇంటర్నెట్, వాట్సాప్, మెయిల్స్ చేస్తున్న వింతలు ఎన్నో ఎన్నెన్నో. విలాస వస్తువుగా ప్రారంభమై, అవసరంగా మారిపోయిన సెల్‌ఫోన్లు ఆకర్షణీయమైన రూపాల్లో అందుబాటు ధరల్లో లభ్యమవుతున్నాయి. ఈ రోజుల్లో సమాచార వ్యవస్థకు పునాది అయిన తపాలాను అసలు వాడని వారున్నారు. ఇది  వేగంగా మారుతున్న కాలానికి దర్పణం పడుతుంది. ఈతరం విద్యార్థులు పాఠాలలో మినహా పోస్టుకార్డులు వాడే, లేఖలు  రాసే సంస్కృతికి దాదాపు దూరంగా ఉన్నారు.
 

మరిన్ని వార్తలు