అరుదైన చర్మ వ్యాధి..ఒకేసారి వందలాది చీమలు

5 Oct, 2023 14:06 IST|Sakshi

చర్మ వ్యాధులకు సంబంధించి చాలా భయనకమైనవి చూశాం. మరికొన్ని చర్మ వ్యాధులు పుండ్లు, గాయాలుగా మారి ప్రాణాలు కోల్పోయేలా చేయడం గురించి కూడా విన్నాం. ఈ చిన్నారికి వచ్చిన వ్యాధి అత్యంత అరుదైనది, వర్ణించలేనంత బాధకరమైనది. తీవ్రమైన దురద తోపాటు బహిరంగ గాయంలా మారి తట్టుకోలేని నరకయాతన అనుభవిస్తున్నాడు ఆ తొమ్మిదేళ్ల చిన్నారి. 

వివరాల్లోకెళ్తే..యూకేలోని నార్తాంప్టన్‌కి చెందిన థియోడర్‌ మోరార్‌ అనే తొమ్మిదేళ్ల చిన్నారి అరుదైన చర్మ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. దీని కారణంగా అతని చర్మం కింద వందలాది చీమలు పాకినంత దురదగా ఉండి, చర్మం​ పగిలి రక్తస్రావం అవుతుంది. ఆ తర్వాత విపరీతమైన దురద. ఒక పక్క రక్తంకారడంతో దాన్ని గోకలేనంత దారుణమైన స్థితి. ఆ యాతన అనుభవించలేక ఆ చిన్నారి చనిపోతాను నా వల్ల కాదు అంటుంటే.. ఆ తల్లిదండ్రుల ఆ ఆవేదన వర్ణానాతీతం.

కళ్లముందే కన్న కొడుకు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు ఆ తల్లిదండ్రులు. ఆ చిన్నారి పుట్టుకతోనే ఈ పరిస్థతితో జన్మించాడు. అది క్రమంగా పెరిగిపోడం జరిగింది. కొంతకాలం తగ్గినట్లు తగ్గి మళ్లీ విజృంభించింది. దీంతో ఆ చిన్నారి శరీరం గాయాలతో రక్తం కారి పగుళ్లుగా ఉంటుంది. ఈ పరిస్థితి కారణంగా చేతులు కాళ్లు కదిలించలేదు. తట్టుకోలేని దురదను భరించలేక ఎన్నో రాత్రుళ్లు ఏడుస్తూనే ఉంటాడు. ఈ పరిస్థితిని న్యూరోడెర్మాటిటిస్‌ అని అంటారు.


 
ఏంటీ న్యూరోడెర్మాటిటిస్‌ అంటే..
వైద్య పరిభాషలో దీర్ఘకాలికంగా వచ్చే దురద లేదా స్కేలింగ్‌ ద్వారా వచ్చే ఒక విధమైన చర్మ పరిస్థితి. చర్మంపై వచ్చే దురద ప్రాంతాలను గమనిస్తే.. సాధారణంగా మెడ, మణికట్టు, ముంజేతులు, కాళ్లు లేదా గజ్జలపై ఎక్కువగా ఇలా ఉంటుంది. అయితే న్యూరోడెర్మాటిటిస్‌కి అసలు ప్రధాన కచ్చితమైన కారణం ఏంటన్నది నిపుణులకు కూడ తెలియదు. కొందరి నిపుణుల అభిప్రాయం ప్రకారం తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, భావోద్వేగాలు లేదా నిరాశ కారణంగా ఈ దురద వస్తుంటుందని చెబుతుంటారు.

ఇతర కారణాలు ..

  • నరాలలో గాయాలు
  • పురుగు కాట్లు
  • బిగుతైన దుస్తులు ధరించటం
  • సోరియాసిస్‌ వంటి ఇతర చర్మ వ్యాధులు

లక్షణాలు

  • చర్మంపై విపరీతమైన దురద, పొడిగా మారడం
  • విపరీతమైన నొప్పి
  • జుట్టు ఊడిపోవటం
  • బహిరంగ గాయాలు, రక్తస్రావం
  • ఇన్ఫెక్షన్‌లు, పసుపు రంగు చీము కారడం

చికిత్స

  • దీన్ని దీర్ఘకాలిక చికిత్స ద్వారానే నయం చేయగలం
  • చర్మ లేపనాలతో ఎరుపు రంగులోని వాపు, దురద, సున్నితత్వాన్ని తగ్గించడంలో సహయపడతాయి
  • అలెర్జీని పెంచకుండా యాంటీహిస్టామైన్లు ఇస్తారు
  • పొడిబారటం, దురద లేకుండా ఉండేలా మాయిశ్చరైజ్‌ క్రీములు
  • కూల్‌ కంప్రెస్‌తో చర్మాన్ని మృదువుగాచేసి, మాయిశ్చరైజర్‌  క్రీములు చొచ్చుకునిపోయేలా చేసి త్వరిత గతిన కోలుకునేలా చేస్తారు. 

(చదవండి: ఆల్కహాల్‌ మోతాదుకు మించితే చనిపోతారా? పాయిజిన్‌గా ఎలా మారుతుంది?)

మరిన్ని వార్తలు