మద్యం కోసం జూనియర‍్లను చితకబాదారు

9 Feb, 2017 15:21 IST|Sakshi
వరంగల్‌: మద్యం తాగించాలంటూ జూనియర్ విద్యార్థులను సీనియర్స్ చితకబాదిన విషయం వరంగల్ జిల్లాలో కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితమే ఓ కాలేజీ విద్యార్థులు మద్యం మత్తులో కత్తులతో దాడులు చేసుకోగా.. ఓ స్టూడెంట్ చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటనను మరువకముందే జూనియర్ స్టూడెంట్ పై మద్యం కోసం దాడి చేయడం సంచలనం రేపుతోంది. నగర శివారు లోని ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఐదుగురు సీనియర్ విద్యార్థులు ఓ జూనియర్‌ ను మద్యం తాగించాలంటూ గత కొద్దిరోజులుగా వేధిస్తున్నారు.
 
గురువారం అతడిని బలవంతగా సమీపంలో ఉన్న బారుకు తీసుకెళ్లారు. డబ్బులు లేవని కాళ్లు మొక్కినా వినకుండా వేధించారు. దీంతో మరో స్నేహితుడికి కాల్ చేసి రమ్మన్నాడు. అతని దగ్గర కూడా కేవలం రెండు వందల రూపాయలు ఉండడంతో ఇద్దరినీ చితకబాదిన సీనియర్స్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, వరుస సంఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని వార్తలు