క్రీడా వైద్యంలో మైలురాయి

21 May, 2014 22:47 IST|Sakshi

నాగపూర్: గత కొన్ని సంవత్సరాలుగా నగరంలో గణనీయంగా క్రీడలు పెరుగుతున్నాయి. దానికనుగుణంగా క్రీడా వైద్యం పరిణామం చెందుతోంది. ఇప్పుడు ఎవరెనా నగరంలో క్రీడా సంబంధిత గాయాలకుసంబంధిత ఫిజియోథెరపిస్టుల నుంచి ప్రత్యేక వైద్యం అందుకోవచ్చు. గాయాల ఘటనలు పెరుగుతుండటంతో ఆయా రంగాల్లో క్రీడల శస్త్ర చికిత్స నిపుణుల అవసరం పెరుగుతున్నది.
 ఈ వ్యాధుల చికిత్స కోసం ఇప్పటికే నగరంలో కొన్ని సౌకర్యాలున్నా డాక్టర్ సతీష్ సోనార్ ఏర్పాటు చేసిన ద స్పోర్ట్స్ మెడ్ జాయింట్ కేర్ సెంటర్ అదనం.

 ఎండోస్కోపీతో కీళ్ల స్థితిని పరిశీలించడం, శరీరంలోని అన్ని కీళ్ల శస్త్రచికిత్సల కు ప్రత్యేకమైన ఆయన తుంటి కీలు శస్త్రచికిత్సలోనూ నిపుణుడు. క్రీడా సంబంధిత గాయాలన్నింటికి చికిత్సను ఒకే గూటి కిందికి తెచ్చి అధునాతన సౌకర్యాలతో ఆస్పత్రి ఏర్పాటు చేశారు. క్రీడల వల్ల అయ్యే చాలా గాయాలకు సంప్రదాయ పద్ధతులైన విశ్రాంతి, ఐస్ ముక్కలు, ఒత్తిడి, పునరుద్ధరణ వంటి థెరపీతోనే తగ్గించవచ్చునని, కొన్ని గాయాలకు మాత్రమే శస్త్ర చికిత్స అవసరమవుతుందని డాక్టర్ సతీష్ తెలిపారు.

 నగరంలో కొద్దిమంది నిపుణులైన స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్టులు ఉన్నా... సాధారణంగా అందరూ సాధారణ ఎముకల వైద్యుల దగ్గరికే వెళ్తున్నారు. క్రీడా వైద్యం పెంచడం ద్వారా ఒక్క క్రీడాకారులనే కాకుండా ఇతరులను కూడా క్రీడలవైపు ప్రోత్సహించడమవుతుందని గత కొన్నేళ్లుగా క్రీడా వైద్య సంస్థను నడిపిస్తున్న సీనియర్ ఆర్థోపెడీషియన్ డాక్టర్ సంజయ్ మార్వా చెబుతున్నారు. ‘అన్ని కీళ్ల గాయాలకు నేను చికిత్స చేయలేను. అందుకే అందుకోసం ప్రత్యేకించి ఒక కీ ళ్ల వ్యాధుల వైద్య కేంద్రం అవసరం నగరానికి ఎంతైనా ఉంది’ అనిఆయన అభిప్రాయపడ్డారు.

 ‘ప్రత్యేకించి క్రీడా వైద్యంలోనే చికిత్స అందిస్తున్న సర్జన్స్ రావడం, కేవలం క్రీడలకే కాదు, అది ఇతర వైద్యులకు శుభ సూచకం. ‘క్రీడాకారులకు ప్రత్యేకమైన చికిత్స అవసరమవుతుంది. వారు కండరాల గాయాలతోనే కాదు... కీళ్ల గాయాలతోనూ బాధపడుతుంటారు. వీటికి గనుక అంకితభావం కలిగిన, ప్రత్యేకతలున్న డాక్టర్లుంటే చికిత్స నాణ్యత పెరుగుతుంది’ అని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మరియు ఆస్పత్రి ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ సత్యజిత్ జగతప్ అన్నారు.

 సాధారణంగా క్రీడాకారులు చికిత్స కోసం నగరాన్ని వదిలి వెళ్లడానికి ఇష్టపడక పోవడానికి కారణం సమయం వృథా అవడంతోపాటు ఖరీదైనది కూడా కావడమే అని న గరానికి చెందిన రంజీ క్రీడాకారుడు ఫయాజ్ ఫజల్ అన్నారు.  ‘ప్రతి ఒక్క క్రీడాకారుడు అత్యున్నత స్థాయికి చేరుకోకపోవచ్చు. అయితే దానర్థం అతనికి లేదా ఆమెకు సరైన చికిత్స అవసరం లేదని కాదు. నగరంలో కొత్తగా కీళ్ల సంబంధ వ్యాధుల చికిత్స కేంద్రం ఏర్పాటు చేశారని తెలిసింది. నగరంలో క్రీడా వైద్యం పెరగడం సంతోషాన్నిస్తోంది’ అని ఫజల్ అన్నారు. వీటి ఏర్పాటు వళ్ల క్రీడాకారులు ఎంతో ప్రయోజనం పొందుతారని స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ ఆశిష్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఈ చికిత్సలో ఎన్నో కొత్త సాంకేతిక పద్ధతులను నగరానికి ఆయన పరిచయం చేశాడు.

 పూర్తి స్థాయి కీళ్లవ్యాధుల చికిత్స కేంద్రాన్ని నగరంలో ఏర్పాటు చేయడాన్ని క్రికెట్ కోచ్ ప్రవీణ్ హింగనికర్‌తోపాటు బ్యాడ్మింటన్ కోచ్ జి.బి.వర్గీస్ కూడా స్వాగతించారు. ‘క్రీడలు, క్రీడాకారులు పెరుగుతున్న మాట వాస్తవం. కానీ సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, క్రమశిక్షణారాహిత్యమైన సాధన వల్ల క్రీడాకారులకు గాయాలు కూడా పెరుగుతున్నాయి. ప్రత్యేకించి క్రీడా సంబంధిత వైద్యం అందించే  డాక్టర్లుండటం ఆటగాళ్లకు ఓ వరం. క్రీడాకారులకు అయ్యే గాయాలకు అధునాతన చికిత్స పద్ధతులు నగరంలో అందుబాటులోకి రావడం ఆనందాన్నిస్తోంది’అని క్రికెట్ కోచ్ ప్రవీణ్ హింగనికర్ తెలిపారు. నగరంలో వీటి ఏర్పాటుతో క్రీడాకారులు చికిత్స కోసం మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని వ ర్గీస్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 నగరంలో క్రీడా వైద్య సదుపాయాలు పెరుగుతుండటంతో నగర బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అరుంధతి పంట్వానే, సారంగ్ లఖానీ హర్షం వ్యక్తం చేశారు. భుజానికి గాయాల కారణంగా ప్రస్తుతం అరుంధతి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఫిజియోథెరపిస్టులు చాలా మందే ఉన్నప్పటికీ శస్త్ర చికిత్సల్లోనూ నిపుణులైన వారు ఉండటం ప్రయోజనకరమైనదని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు