అమిత్‌షా క్షమాపణ చెప్పాలి: ఉత్తమ్‌

22 May, 2017 17:26 IST|Sakshi
అమిత్‌షా క్షమాపణ చెప్పాలి: ఉత్తమ్‌
హైదరాబాద్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని హామీల అమలులో బీజేపీ విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దీనిపై క్షమాపణలు చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళతామని ఆయన వెల్లడించారు.
 
ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా ప్రాజెక్టులు, జలాశయాల నిర్మాణం కోసం అంటూ ప్రజలు, రైతుల నుంచి బలవంతంగా భూమిని లాక్కుంటోందని ఆరోపించారు. అదేవిధంగా చారిత్రక పరేడ్‌గ్రౌండ్స్‌లో కొత్తగా సెక్రటేరియట్‌ కోసం నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం పూనుకోవటాన్ని ఆయన విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది వృథా చర్య అని అభివర్ణించారు.
మరిన్ని వార్తలు