ఎక్సైజ్‌’ దేహదారుఢ్య పరీక్షల్లో 177 మంది అర్హత

9 Dec, 2017 04:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎక్సైజ్‌ కానిస్టేబుళ్ల రెండో దఫా దేహదారుఢ్య పరీక్షల్లో 177 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. వీరిలో 124 మంది పురుషులు కాగా, 53 మంది మహిళలు ఉన్నారు. 2016 జూలై 31న 340 పోస్టుల కోసం టీఎస్‌పీఎస్సీ అర్హత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో అర్హుత సాధించిన 1,171 మందికి ఈ ఏడాది ఏప్రిల్‌లో దేహదారుఢ్య పరీక్ష నిర్వహించగా కేవలం 341 మంది మాత్రమే అర్హత సాధించారు.

దీంతో మరో 443 మందికి ఈ నెల 5, 6 తేదీల్లో రెండవ దఫా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. కాగా, అర్హత సాధించిన పురుష అభ్యర్థులకు ఈ నెల 12 నుంచి 15 వరకు, మహిళా అభ్యర్థులకు ఈ నెల 16న కంటిచూపు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఉదయం 9 గంటల కల్లా మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలోని అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌లో హాజరుకావాలని టీఎస్‌పీఎస్సీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు తమ వెంట హాల్‌ టికెట్, 2 పాస్‌పోర్టు సైజ్‌ ఫోటోలు, ఫోటో గుర్తింపు కార్డుతో పాటు రూ.300 ఫీజు తీసుకురావాలని పేర్కొంది.  

మరిన్ని వార్తలు