ఐకియాలో మహిళలకు 350 ఉద్యోగాలు

31 Oct, 2017 02:26 IST|Sakshi

హైదరాబాద్‌లో ప్రారంభంకానున్న స్టోర్‌.. మంత్రి జూపల్లి వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: పరిశ్రమలు, సంస్థల స్థాపనకు దేశంలోనే అత్యంత అనువైన ప్రదేశం తెలంగాణ అని, ఇక్కడ సమర్థవంతమైన మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రముఖ బహుళజాతి కంపెనీ ఐకియా దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో తమ రిటైల్‌ స్టోర్‌ను ఫిబ్రవరిలో ప్రారంభించనుంది.

ఇందులో పనిచేసేందుకు తెలంగాణలోని 350 మంది మహిళలకు అవకాశం కల్పిస్తుంది. వీరికి న్యాక్‌లో 45 రోజులపాటు ఇవ్వనున్న శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. మంత్రి సమక్షంలో దీనికి సంబంధించిన ఒప్పందం(ఎంవోయూ)పై నేషనల్‌ అకాడమీ ఫర్‌ కన్‌స్ట్రక్షన్‌(న్యాక్‌), ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ అండ్‌ మార్కెటింగ్‌ మిషన్‌(ఈజీఎంఎం), ట్రస్ట్‌ ఫర్‌ రిటైలర్స్‌ అండ్‌ రిటైల్‌ అసోసియేట్స్‌ ఆఫ్‌ ఇండియా(ట్రైన్‌), యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(యూఎన్‌డీపీ) ప్రతినిధులు సంతకాలు చేశారు.    

మరిన్ని వార్తలు