ఖమ్మం: ఓటరు ఎటువైపో...!

3 Dec, 2018 14:36 IST|Sakshi
ములకలపల్లి: పార్టీలోకి ఆహ్వానిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు

సాక్షి, దమ్మపేట: ముందస్తు ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉంది. ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ మొదలైంది. అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారోనన్న చర్చ సర్వత్రా సాగుతోంది. ఇక్కడ పోటీని ప్రధాన అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే, పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్, ప్రజాకూటమి(టీడీపీ)కిఅశ్వారావుపేటలో గట్టి పట్టుంది. బీజేపీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు, టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై గెలుపొందారు. ఆ తరువాత,. టీఆర్‌ఎస్‌లోకి తాటి వెళ్లారు. ఇప్పుడు కూడా వీరిద్దరి మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఈసారి ఎలాగైనా ఇక్కడ నుంచి గెలిచి తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని తాటి, గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసిన తాను కూటమి బలంతో గెలవాలని మెచ్చా నాగేశ్వరరావు.. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కూటమి అభ్యర్థి నామినేషన్‌కు, శుక్రవారం దమ్మపేటలో నిర్వహించిన సభకు భారీగా జనం భారీగా వచ్చారు. దీంతో, గెలుపు తమదేనన్న ధీమా కూటమిలో కనిపిస్తోంది. 

దమ్మపేట: మందలపల్లి ప్రచారంలో ఏపీ ఎమ్మెల్యే వీరాంజనేయులు 

బీజేపీ ఉధృత ప్రచారం
ఈ ఎన్నికల్లో తొలిసారిగా బీజేపీ పోటీ చేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థిగా స్థానికుడైన డాక్టర్‌ భూక్యా ప్రసాదరావు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలకు ధీటుగా బీజేపీ ప్రచారం నిర్వహిస్తోంది. గత నెల మొదటి వారంలో దమ్మపేటలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావుతో పోలింగ్‌ కేంద్రాల సభ్యుల సమ్మేళనం పేరుతో భారీ సభ జరిగింది. అభ్యర్థి కూడా ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఈ ముగ్గురిలో.. ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారో.. !
ఆదరించండి ... అభివృద్ధి చేస్తా..

అన్నపురెడ్డిపల్లి: పెంట్లంలో మాట్లాడుతున్న భూక్యా ప్రసాద్‌ 
అన్నపురెడ్డిపల్లి: తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని బీజేపీ అభ్యర్ధి  భూక్యా ప్రసాద్‌   హామీ ఇచ్చారు. ఆయన ఆదివారం మండలవ్యాప్తంగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అవినీతిరహితపాలన అందిస్తున్న బీజేపీని గెలిపించాలని అభ్యర్థించారు. పార్టీ మండల అ«ధ్యక్షుడు బాల్‌రెడ్డి, నాయకులు సత్యనారాయణ, డీ.వెంకటేశ్వర్లు, రాజు పాల్గొన్నారు. 
కూటమి ఇంటింటి ప్రచారం

అన్నపురెడ్డిపల్లి: మర్రిగూడెంలో కూటమి నాయకుల ప్రచారం 

అన్నపురెడ్డిపల్లి: మండలంలోని మర్రిగూడెం, ఎర్రగుంట గ్రామాలలో ఆదివారం మహాకూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నాయకులు పర్సా వెంకటేశ్వర్లు, ఇనపనూరి రాంబాబు, వీరబోయిన వెంకటేశ్వర్లు,వీరబోయిన నాగేశ్వరరావు, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.
న్యూడెమోక్రసీ ఇంటింటి ప్రచారం ..
అన్నపురెడ్డిపల్లి: మండలంలోని అబ్బుగూడెం, మర్రిగూడెం, బుచ్చన్నగూడెం గ్రామాలలో ఆదివారం న్యూడెమోక్రసీ అభ్యర్థి కంగాల కల్లయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే పోడుభూముల రక్షణకు, రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. కేసీఆర్‌ ప్రభుత్వం హరితహారం పేరుతో పోడు భూములను లాక్కుందని విమర్శించారు. నాయకులు పద్దం శ్రీను, వీరరాఘవులు, కాక శివా, సీతయ్య, విజయ్, మడకం నగేష్‌ తదితరులు పాల్గొన్నారు. 
రేణుకాచౌదరి వర్గీయుల ర్యాలీ ..

చండ్రుగొండలో రేణుకాచౌదరి వర్గీయుల బైక్‌ ర్యాలీ 
చండ్రుగొండ: కూటమి అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు ప్రచారంలో ఇప్పటివరకు పాల్గొనకుండా అలకపాన్పు ఎక్కిన కాంగ్రెస్‌ పార్టీలోని రేణుకాచౌదరి వర్గీయులు.. శాంతించారు. ఆమె వర్గం నాయకుడైన సంకా రామారావు, తన అనుచరులతో కలిసి ఆదివారం మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఆ తరువాత, ఇమ్మడి రామయ్యబంజర్‌లోని మామిడితోటలో సమావేశం నిర్వహించారు. కూటమి అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు గెలుపుకు కృషి చేద్దామని సంకా రామారావు అన్నారు. నాయకులు నరుకుళ్ళ వెంకటనారాయణ, కాశీరాం, ఈసం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 
టీఆర్‌ఎస్‌లో చేరిక 
ములకలపల్లి: ఆదివాసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోండ్రు సుందర్‌రావు ఆదివారం టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దమ్మపేట మండలంలో ఆదివారం జరిగిన టీఆర్‌ఎస్‌ సమావేశంలో ఆయనను తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆహ్వానించారు. 
టీఆర్‌ఎస్‌ ఇంటింటి ప్రచారం  
చండ్రుగొండ: టీఆర్‌ఎస్‌ నాయకులు ఆదివారం మంగపేట, చాపరాలపల్లి, పూసుగూడెం గ్రామాల్లో  ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు పాలకుర్తి ప్రసాద్, నాయకులు మునీశ్వరరావు, జగదీష్, ప్రకాష్, లోకేష్, తాటి రవి, కుంజా రవి, ఉదయ్, పద్దం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 
బీఎస్పీని ఆదరించండి..

ములకలపల్లి: ట్రాక్టర్‌ నడుపుతున్న రమేష్‌నాయక్‌ (బీఎస్పీ) 
ములకలపల్లి: బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ)ని ఓటర్లు ఆదరించాలని అశ్వారావుపేట అభ్యర్థి బాణోతు రమేష్‌ నాయక్‌ కోరారు. మండలంలోని పూసుగూడెంలో ఆదివారం ఆయన ప్రచారం నిర్వహించారు. నాయకులు ఇంచార్జ్‌ గద్దల రవి, రాంబాబు, మోహన్, మంగీలాల్, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.   
అవకాశవాద పార్టీలను ఓడించండి ..

చండ్రుగొండ: న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ర్యాలీ దృశ్యం 
చండ్రుగొండ: అవకాశవాద పార్టీలను ఓడించాలని న్యూడెమోక్రసీపార్టీ రాష్ట్ర నాయకుడు కె.రంగారెడ్డి కోరారు. పార్టీ అభ్యర్థి కంగాల కల్లయ్య విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం ఇక్కడ ర్యాలీ, సభ జరిగాయి. సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న న్యూడెమోక్రసీ అభ్యర్థి కల్లయ్యను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్కే ఉమర్, వరికూటి వెంకట్రావ్, తోలెం వెంకటేశ్వర్లు, పొడెం భద్రమ్మ, బాబురావు, కుంజా వెంకటేశ్వర్లు, భద్రు, ముత్తారావు పాల్గొన్నారు.
బీజేపీ ప్రచారం
ములకలపల్లి: బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ భూక్యా ప్రసాదరావును గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి డాక్టర్‌ ఉదయజ్యోతి ఆదివారం ములకలపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  పార్టీ మండల అద్యక్షుడు అనుమల శ్రీనివాస్, నాయకులు నాగుబండి సందీప్, నారాయణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. 
ఉంగుటూరు ఎమ్మెల్యే ప్రచారం
దమ్మపేట: ప్రజాకూటమి అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ కూటమి నాయకులతో కలిసి, మందలపల్లిలో ఆదివారం సాయంత్రం ఆంధ్రాలోని ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ప్రచారం చేశారు. మెచ్చా సతీమణి శ్యామల, నాయకులు గన్నమనేని నాగేశ్వరరావు, గారపాటి సూర్యనారాయణ, అనురాధ, సైదా, కొండపల్లి కృష్ణమూర్తి, నల్లగుళ్ల కిరణ్, రత్నకుమారి, బలుసు గోపి, పల్లెల గాంధీ తదితరులు పాల్గొన్నారు. 
బీఏస్పీ ప్రచారం 
అశ్వారావుపేటరూరల్‌: బీఏస్పీ అభ్యర్థి బాణోత్‌ రమేష్‌ నాయక్‌ ఆదివారం ఇంటింటి ప్రచారం చేశారు. తనను గెలిపించాలని కోరారు. నాయకులు గద్దల రవి, రాంబాబు, మోహన్, మంగీలాల్, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు