మిర్యాలగూడ: వరసలు కలిపి ...ఓట్లు అడిగి..

3 Dec, 2018 09:49 IST|Sakshi

ప్రచారంలో గుర్తుకొస్తున్న బంధుత్వాలు 

సాక్షి, మిర్యాలగూడ రూరల్‌ : ఇనాళ్లు చూసీ చూనట్లు వ్యవహరించిన నేతలకు ఎన్నికల ప్రచారంలో బంధుత్వాలు గుర్తుకొస్తున్నాయి. గ్రామాల్లో తమ తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ద్వితీయ శ్రేణి నాయకులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచార సమయంలో నేతలందరూ వరుసలు కలిపి ఓటర్లను పలకరిస్తున్నారు. గ్రామాల ఓటర్లతో పాటు పక్క గ్రామంలో ఉన్న పార్టీ కార్యకర్తల బంధువుల ఓటర్ల సహితం జార విడుచుకోకుండా ముమ్మరప్రయత్నాలు చేస్తూ, సాధారణ కార్యక్తలను సైతం అభ్యర్థులు, ముఖ్యనాయకులు మచ్చిక చేసుకొంటున్నారు. మర్యాదగా మాట్లాడడంతో పాటు మనోళ్ల ఓట్లు మిస్‌ కాకుండా చూడండని అదేపనిగా చెబుతున్నారు.

గ్రామ, మండల స్థాయిలో కాస్తా పేరున్న వారిని కలిసి తమ వైపు తిప్పుకొనేందుకు వివిధ పార్టీల్లో ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇలా రాకుండా గతంలో గుర్తుకు రాని సంఘాలను, నాయకులునుమరీ మరీ గుర్తుకు చేసుకొని సభలు చసమావేశాలు నిర్వహించి ఓటర్లను కూడగట్టుకొనే ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికి తోడు గ్రామాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు తమ నేతకు మద్దతుగా, బంధువర్గ ఓటర్లను గూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

మరిన్ని వార్తాలు...

మరిన్ని వార్తలు