అభ్యర్థులు.. నిబంధనలు 

15 Nov, 2018 10:38 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌ వేసే దగ్గర నుంచి ప్రచా రం నిర్వహించే వరకు ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు లోబడే ప్రవర్తించాలి. అభ్యర్థులు, రాజకీ య పార్టీలు నిబంధనలను అతిక్రమిస్తే ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమిస్తుంది.  
నామినేషన్‌ దాఖలుకు..
రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం నుంచి వంద మీటర్ల పరిధిలోకి మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థితో సహా ఐదుగురు వ్యక్తులకు మాత్రమే కార్యాలయంలోకి అనుమతి ఇస్తారు.  
నామినేషన్ల పరిశీలన 
అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్, ఒక ప్రతిపాదకుడు, మరో వ్యక్తి(న్యాయవాది కావచ్చు) పరిశీలనకు వెళ్లవచ్చు. దీనికి అభ్యర్థి రాతపూర్వకంగా అనుమతి అవసరం ఉంటుంది.  
వాహనాల వినియోగం..
ఎన్ని వాహనాలైనా ఎన్నికల ప్రచారానికి వాడవ చ్చు. రిటర్నింగ్‌ అధికారి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఒరిజినల్‌ అనుమతి పత్రాన్ని స్పష్టం గా కనిపించేలా వాహనానికి అతికించాలి. పర్మిట్‌ మీద వాహన నంబర్, అభ్యర్థి వివరాలుఉండాలి. పర్మిట్‌ వాహనాన్ని అదే అభ్యర్థికి వాడాలి. దాన్ని ఇంకో అభ్యర్థికి ఉపయోగిస్తేభారతీయ శిక్షాస్మృతి సెక్షన్‌ 171(హెచ్‌) కింద చర్యలు తీసుకుంటారు. అనుమతి లేకుండా ఏ వాహనాన్ని ఎన్నికల కోసం వాడకూడదు. మోటార్‌ వెహిరల్‌ చట్టానికి లోబడి వాహనాలకు అదనపు ఏర్పాట్లు చేసుకోవచ్చు.  

  • విద్యా సంస్థలు, వారి మైదానాలను ప్రచా రానికి వాడకూడదు.
  • ప్రైవేటు భూములు, భవనాల య జమానుల లిఖితపూర్వక అనుమతి తీసుకుని రిటర్నింగ్‌ అధికారికి అందించిన తర్వాతనే గోడ పోస్టర్లు అతికించి ప్రచారం చేయాలి. 
  • ఎన్నికల కరపత్రాలపై ముద్రణాలయాల పేరు, చిరునామా విధిగా ఉండాలి.  ప్రచారంలో భాగంగా టోపీలు, కండువాలు ఇవ్వొచ్చు. వీటిని ఎన్నికల ఖర్చులో చూపించాలి.
  • చీరలు, చొక్కాలు ఇవ్వకూడదు.  
  • దేవుళ్ల ఫొటోలు, అభ్యర్థి ఫొటోలతో  డైరీలు, క్యాలెండర్లు ప్రచురించరాదు. వాహనాల స్టెప్నీ కవర్లపై మత సంబంధిత ఫొటోలు, అభ్యర్థి ఫొటోలు ఉండడానికి వీల్లేదు.   
మరిన్ని వార్తలు