ఇంకా అవకాశం ఉంది

26 Oct, 2018 17:55 IST|Sakshi

నల్లగొండ : ఓటరు నమోదుకు ఇంకా అవకాశం ఉంది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు వరకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించింది. ఇప్పటివరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ద్వారా ఓటరుగా నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ ద్వారానే నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ ఏడాది జనవరి ఒకటి వరకు 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు ఓటుహక్కు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబర్‌ 10 నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పించారు. అందుకు సంబంధించి జిల్లా ఎన్నికల సంఘం సూచనల మేరకు కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, డీఆర్‌ఓ, ఏఓలు ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహిం చారు. గ్రామం, పట్టణాల్లో బీఎల్‌ఓలు ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. దీంతో జిల్లా అధికారులు ఊహించిన దానికంటే అధికంగా దరఖాస్తులు వచ్చాయి. వచ్చినవా టిని పరిశీలించి 49వేల మంది కొత్తవారికి ఓటు హక్కు కల్పించారు. అదే విధంగా మార్పులు, చేర్పులకు అవకాశం ఇచ్చి సరిచేశారు. తుది ఓటరు జాబితాను ఈ నెల 11న విడుదల చేశారు.

ఓటరు తుది జాబితాను విడుదల చేసినప్పటికీ ఇంకా దరఖాస్తు  చేసుకోని వారు ఉన్నారని భావించిన ఎన్నికల కమిషన్‌ మరోసారి అవకాశం కల్పించింది. నవంబర్‌ 12న ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది.  అభ్యర్థులకు నామినేషన్‌ చివరి తేదీ నవంబర్‌ 19. అప్పటివరకు కొత్తగా ఓటరు నమోదుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 12నుంచి కొత్తగా ఓటు కోసం నమోదుచేసుకున్న వారికి అధికారులు మదర్‌ రోల్‌లో కాకుండా ప్రత్యేక సప్లిమెంటరీ ముద్రించి ఓటు హక్కు కల్పిస్తారు. 12నుంచి ఇప్పటివరకు 15 వేల వరకు

దరఖాస్తులు..
ఎన్నికల తుది జాబితా ఈనెల 11వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు సుమారు 15 వేల వరకు నూ తన ఓటుహక్కు, మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తులు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపా రు. నవంబర్‌ 19 వరకు గడువు ఉన్నం దున దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఓటు ఉందా లేదా చెక్‌ చేసుకోవడం..
తమ ఓటు ఉందా లేదా అనేది ఓటర్లు సంబంధిత పోలింగ్‌ స్టేషన్‌లో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో చెక్‌ చేసుకోవాలని ఎన్నికల అధికారులు కోరుతున్నారు. ఒకవేళ లేనట్లయితే చివరి అవకాశం ఉన్నందున ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ వెబ్‌సైట్‌లో ఓటరు కార్డు నంబర్‌ కొడితే ఓటు హక్కు ఉందా లేదా అనేది తెలిసిపోతుందని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు