రాహుల్‌తో ఆశావహుల భేటీ

15 Nov, 2018 13:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మూడో జాబితాలో ప్రకటించాల్సిన 19 స్ధానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులపై కసరత్తు తుదిదశకు చేరుకుంది. కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీతో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, తెలంగాణ పార్టీ ఇన్‌ఛార్జి ఆర్సీ కుంతియాలు గురువారం సమావేశమై తుది జాబితాపై చర్చించారు. 12 స్ధానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా మిగిలిన ఏడు స్ధానాల్లో తీవ్ర పోటీ ఉండటంతో ఆశావహులతో నేరుగా పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ మాట్లాడే ఏర్పాటు చేశారు.

తుంగతుర్తి నుంచి అభ్యర్థిత్వం ఆశిస్తున్న అద్దంకి దయాకర్‌, వడ్డేపల్లి రవి, మిర్యాలగూడ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి, జనగామ సీటుపై పొన్నాల లక్ష్మయ్యతో పాటు సనత్‌నగర్‌ స్ధానంలో మర్రి శశిధర్‌ రెడ్డి, హుజూరాబాద్‌ నుంచి రేసులో ఉన్న కౌశిక్‌ రెడ్డిలు రాహుల్‌తో సాయంత్రం భేటీ కానున్నారు.

రాహుల్‌తో ఆశావహుల భేటీ అనంతరం ఈ ఏడు స్ధానాల్లో పార్టీ అభ్యర్ధులను ఖరారు చేస్తారు.ఈ రోజు సాయంత్రం, రేపు ఉదయం కొన్ని పేర్లతో తుది జాబితా విడుదల కానుంది. అంతకుముందుకు రాహుల్‌ నివాసంలో స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం ముగిసింది. 19 స్ధానాల్లో అభ్యర్ధుల  ఎంపిక, సామాజిక సమీకరణాలపై ఈ భేటీలో చర్చించారు.

మరిన్ని వార్తలు