విజయ ఢంకా మోగిస్తాం..

9 Nov, 2018 12:09 IST|Sakshi

అధికారంలోకి రాగానే ప్రజాపాలన తెస్తాం

ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి సీతక్క 

సాక్షి,ములుగు: ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయ ఢంకా మోగిస్తుందని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క అన్నా రు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ములుగు మండలంలోని అంకన్నగూడెం, జగ్గన్నగూడెం, లాలాయిగూడెం, సర్వాపురం, దుబ్బగూడెం, రాయిని గూడెం, కన్నాయిగూడెం, పంచో త్కులపల్లి, కొత్తూరు, యాపలగడ్డ, కాశిందేవిపేట గ్రామాల్లో పర్యటించారు. ఆమెకు  ప్రజలుమంగళహారతులతో స్వాగతాలు పలికారు. సీతక్క మా ట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు ఖాయం.. అధికారంలోకి రాగానే స్వచ్ఛమైన ప్రజాపాలనను అందిస్తామన్నారు.

కేసీఆర్‌ ఓ మోసకారి.. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన ఏఒక్క హామీని నెరవర్చకుండా నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే బొగ్గులవాగుపై చెక్‌డ్యాం నిర్మించి ఏజెన్సీ గ్రామా ల రైతులకు రెండు పంటలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో హరితహారం పేరుతో పోడుభూములను లాక్కున్న ఘన త కేసీఆర్‌దేనని, రైతుబంధు పథకంలో పోడు రైతులకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం  పోడుదా రులకు పట్టాలు అందించడంతోపాటు వారికి అండగా ఉందని చెప్పారు.

రెండు సార్లు మంత్రిగా చేసిన చందూలాల్‌ గిరిజనులకు ఒరగబెట్టిందేమీ లేదని, దోచుకోవడం తప్ప ప్రజల బాగోగులు చూడలేదని ధ్వజమెత్తారు. గిరిజన బిడ్డనైన తనపై చందూలాల్‌ కావాలనే తన వర్గంతో లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. మాజీ ఎంపీపీలు నల్లెల్ల కుమారస్వామి, మస్రగాని వినయ్‌కుమార్, గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, పల్లె జయాపాల్‌రెడ్డి, ఆకుతోట చంద్రమౌలి, ముస్నినల్లి కుమార్‌గౌడ్, షర్పొద్దీన్, హరినా«థ్‌గౌడ్, మావురపు తిరుపతిరెడ్డి, కోగిల మహేశ్, ఎండీ.అహ్మద్‌పాషా, చదువు రాంరెడ్డి, దేవేందర్‌గౌడ్, ఈక క్రిష్ణ, అల్లెం బుచ్చయ్య, బొమ్మకంటి రమేశ్, మంకిడి పూర్ణ, మహేందర్‌ లు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు