ఢిల్లీ ప్రార్థనల్లో తెలంగాణ నుంచి 1030 మంది!

31 Mar, 2020 13:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌ మసీదు దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. అక్కడకు మత ప్రార్థనలకు వెళ్లినవారిలో కొందరికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇక తెలంగాణ నుంచి ఢిల్లీ ప్రార్ధనలకు 1030 మంది వెళ్లినట్టు ప్రభుత్వం గుర్తించింది. వారిలో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధి నుంచి 603 మంది హాజరైనట్టు మంగళవారం వెల్లడించింది.
(చదవండి: ఆరుకు చేరిన మరణాలు..)

నిజామాబాద్ 80, నల్లగొండ 45, వరంగల్ అర్బన్ 38, ఆదిలాబాద్ 30,  ఖమ్మం 27, నిర్మల్ 25, సంగారెడ్డి 22 మంది మర్కజ్‌ మసీదు ప్రార్థనల్లో పాల్గొన్నారని తెలిపింది. కాగా, ‘ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్‌ సోకింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు’ అని ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం రాత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని, స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది.
(చదవండి: ఏపీలో 40కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు)

మరిన్ని వార్తలు