హైదరాబాద్‌ తర్వాత ఇక్కడే ఎక్కువ..

12 Apr, 2020 12:18 IST|Sakshi

లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ కొందరు అనవసరంగా రోడ్లపైకి వచ్చి తిరుగుతున్నారు. దీంతో వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి పాకుతోంది. కొన్ని ప్రైమరీ కాంట్రాక్టు కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూరగాయలు, ఇతర దుకాణాలకు సాయంత్రం ఆరు గంటల వరకు ఉన్న అనుమతిని ఈ రోజు నుంచి మధ్యాహం ఒంటి గంటకే కుదించారు. వైద్యం వంటి అత్యవసర సేవలకు సైతం ఇందులో మినహాయింపు లేదు.

సాక్షి, నిజామాబాద్‌: లాక్‌డౌన్‌ అమలులో జిల్లా అధికార యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యావసర సరుకుల కొనుగోలు కో సం  ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇదివరకు ఉన్న మినహాయింపు సమయాన్ని మధ్యాహ్నం ఒంటి గంటకే పరిమితం చేసింది. ఇకపై కూరగాయలు, కిరాణ షాపులు, నిత్యావసరాల వస్తువుల దుకాణాలు సైతం మధ్యా హ్నం ఒంటి గంటకే మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఆదివారం నుంచే ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ.. సోమవా రం నుంచి ఈ నిబంధనను కఠినంగా అమలు చేయనున్నారు. హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లాలో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

కరోనా వైరస్‌ వ్యాపిస్తుండటంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కొందరు తమ తీరు మార్చుకోవడం లేదు.  అనవసరంగా రోడ్లపై, పబ్లిక్‌ ప్లేసుల్లో సంచరిస్తున్నారు. కొందరు ఆకతాయిలు రోడ్లపై వచ్చి తిరుగుతున్నారు. దీంతో లాక్‌డౌన్‌ కొన్ని ప్రాంతా ల్లో అమలు కావడం లేదు. దీంతో వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి పాకుతోంది. కొన్ని ప్రైమరీ కాంట్రాక్టు కేసులు కూడా నమోదవుతున్నాయి. ముఖ్యంగా మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి నుంచి కొందరికి వైరస్‌ వ్యాపించింది. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టం చేయాల్సి న అవసరం ఎంతైనా ఉందని భావించిన అధికార యంత్రాంగం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ప్రజలను బయటకు అనుమతించవద్దని నిర్ణయించింది. సోమవారం నుంచి కొత్త నిబంధనను పక డ్బందీగా అమలు చేయాలని భావిస్తోంది. 

49కి చేరిన పాజిటివ్‌ కేసులు
జిల్లాలో కొత్తగా మరో ఇద్దరికి కరోనా వ్యాధి సోకి నట్లు శనివారం నిర్ధారణ అయింది. గురువారం నాటికే 47 పాజిటివ్‌ కేసులు ఉండగా, శనివారం నమోదైన రెండు కేసులతో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తు ల సంఖ్య 49కి చేరింది. శుక్రవారం వచ్చిన నివేదికల్లో 112 మందికి కరోనా నెగెటివ్‌ వచ్చిన విష యం విధితమే. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఈ తరుణంలో శనివారం మరో రెండు పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మరింకెన్ని కేసులు నమోదవుతాయోనని చర్చించుకుంటున్నా రు.

ఇంకా జిల్లా నుంచి వెళ్లిన రక్తనమూనాలకు సంబంధించిన రిపోర్టులు పదుల సంఖ్యలో రావాల్సి ఉంది. ఈ రిపోర్టుల కోసం బాధిత కుటుంబీకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌ డౌన్‌ను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వారం ఎంతో కీలకం.. లాక్‌డౌన్‌ అమలులో ఈ వారం రోజులు ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్‌ సి నారాయణరెడ్డి పేర్కొన్నారు. వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా రోడ్లపైకి రావద్దని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు