నిఘా నేత్రం..!

29 Nov, 2018 09:22 IST|Sakshi

   ప్రతి అభ్యర్థిపై నిషిత పరిశీలన 

   ఎనిమిది రకాల బృందాలతో నియోజక వర్గాల్లో పర్యవేక్షణ  

సాక్షి, మిర్యాలగూడ రూరల్‌ : ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు పెట్టే ఖర్చు పర్యవేక్షణకు అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేశారు. ఎన్నికల ఏర్పాట్లు , మద్యం, డబ్బు పంపిణీ, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, అనుమతి లేకుండా ప్రచార కార్యక్రమాలు చేపట్టడం లాంటి వాటిని నిరోధించేందుకు ఎనిమిది రకాల బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. వీరు ప్రతి అంశాన్ని నేరుగా పరిశీలకులకు, ఎన్నికల అధికారికి సమాచారం ఇస్తారు. 
వ్యయ పరిశీలకులు :
వ్యయ పరిశీలకులుగా ఐఏఎస్, ఐఆర్‌ఎస్, సెంట్రల్‌ ఎక్సైజ్‌ అధికారులను నియమించారు. ప్రతి జిల్లా నియోజకవర్గాలకు అనుగుణంగా పరి శీలకులను నియమించారు. నల్లగొండ జిల్లాలో ఆరు నియోజక వర్గాలకు గాను ఇద్దరు ఆర్‌.గోపాలస్వామి (నల్లగొండ, నకరేకల్, మునుగోడు నియోజకవర్గాలు), ఆకాశ్‌ దేవా నంద్‌ (మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ నియోజక వర్గాలు) లను వ్యవయ పరిశీలికులుగా నియమించారు. 
ఎంసీసీ (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్టర్‌) :
జిల్లా వ్యప్తంగా ఆరు నియోజకవర్గాల్లో ఈ కమిటీలో 33మంది పని చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఐదు, ఆపై సంఖ్యలో కమిటీలను నియమించారు. ఒక్కో కమిటీలో ఐఏఎస్‌తో పాటు వీడియో గ్రాఫర్‌ ఉంటారు. ప్రవర్తణా నియమావళి ఉల్లంఘనపై సమాచారం ఆధారంగా వీరు రంగంలోకి దిగుతారు. అనుమతి లేని సమావేశాలను రద్దు చేయడం వాహనాలను అడ్డుకోవడం వంటి విధులు నిర్వహిస్తారు.
వీడియో నిఘా బృందాలు :
వీడియో నిఘా బృందాలు నియోజక వర్గానికి ఒ కటి చొప్పున ఉంటుంది. ప్రతి బృందానికి అధి కారి, వీడియో గ్రాఫర్‌ ఉంటారు. వీరు నియోజకవర్గంలో రాజకీయ పార్టీ సభలు, సమావేశాలు, ర్యాలీలు ఇతర ప్రచార కార్యక్రమాలను చిత్రీకరిస్తూ ఉంటారు. ఒకే సమయంలో ఎక్కువ కార్యక్రమాలు ఉంటే అదనపు వీడియో గ్రాఫర్‌ను నియమిచుకునే అధికారం ఆ అధికారికి ఉంటుంది. 
అకౌంట్‌ టీం:
జిల్లాలో మొత్తం ఆరు బృందాలు ఉన్నాయి.ఒక్కొ బృందానికి అధికారి, సహాయకుడు ఉంటారు. వీరు వీడియో వ్యూయింగ్‌ బృందాలు పంపిణీ సామగ్రి లెక్కలు చూసి వాటిని ఎన్నికల నిబంధనల ప్రకారం ధరలు నిర్ణయిస్తారు. 
వీడియో వీక్షణ బృందం :
ప్రతి నియోజకవర్గానికి ఒక బృందం చొప్పున కేంద్రంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ స్టాటిక్‌సర్వోలెన్స్‌ టీం, ఎంసీఎంసీ కమిటీల నుంచి వచ్చిన నివేదికలను, వీడియోలను పరిశీలిస్తారు.ఉదాహరణకు వీడియో బృందం ఇచ్చిన సీడీలో అభ్యర్థి, పార్టీకి సంబంధించిన టోపీలు కండువాలు, జెండాలు, బ్యానర్లు, వాహనాలు ఎన్ని ఉన్నాయని వివరాలు పరిశీలించి నమోదు చేస్తారు.  

సహాయ పరిశీలకులు
పరిశీలకులకు సహాయంగా ఉండేందుకు సహాయ వ్యయ పరిశీలకులను  నియోజకవర్గానికి ఒకరిని నియమించారు. ప్రతి నియోజకవర్గానికి ఆదాయ పన్ను అధికారి (ఐటీఓ) హోదా లేదా ఇతర ప్రభు త్వ సర్వీసుల్లో ఉన్న అధికారులు ఉంటారు. అభ్యర్థులకు సంబంధించిన అన్ని రకాల వ్యయాన్ని పరిశీలిస్తుంది. ఈ అధికారి వద్ద ఒక్కో అభ్యర్థి పే రుతో ఒక రిజిస్టర్‌ ఏర్పాటు చేస్తారు. షాడో రిజిస్టర్‌గా పిలిచే దీనిలో అభర్థికి సంబంధించిన వివిధ కమిటీలు ఇచ్చిన వివరాలు పొందుపరుస్తారు. అభ్యర్థులు చూపే ఎన్నికల ఖర్చుతో షాడో రిజి స్టర్‌ పొందుపరిచిన ఖర్చులతో పోల్చి చూసి తేడా ఉంటే సంజాయిషీ కోరుతారు. అంతిమంగా అ భ్యర్థిఖర్చుల్లో వీరు చెప్పిందే ఫైనల్‌గా ఉంటుంది.

నిఘా బృందాలు 
ఈ బృందాలు నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఉంటారు. జిల్లాలో ఒక్కొక్క నియోజక వర్గానికి మూడు నుంచి నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.ఒక్కొక్క బృందంలో డీటీస్థాయి అధి కారితో పాటు ముగ్గురు లేదా నలు గురు కానిస్టేబుళ్లు ఉంటారు.

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌
ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు ప్రతి నియోజకవర్గంలో మూడు అపై సంఖ్యలో ఉంటారు. ఒక్కో బృందానికి నాయకత్వం వహించే ఒక అధికారి మెజిస్టీరియల్‌ అధికారులు ఉంటారు. ఇలా జిల్లా మొత్తం ఆరు నియోజక వర్గాల  పరిధిలో 18మంది ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు పని చేస్తున్నారు.బృందంలో ఒక వాహనం, ముగ్గురు లేదా నలుగురు కానిస్టేబుళ్లు, ఏఎస్సై , వీడియో గ్రాఫర్‌ ఉంటారు. డబ్బు, మద్యం ఇతర ప్రలోభాలపై సమాచారం ఇస్తే ఆకస్మిక తనిఖీలు చేసి వాటిని రికార్డు చేస్తారు.      

మరిన్ని వార్తలు