ఎర్రవల్లి టు కోనాయిపల్లి

15 Nov, 2018 16:08 IST|Sakshi

కేసీఆర్‌కు పూలతో స్వాగతం పలికిన ఎర్రవల్లి ప్రజలు 
జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం గజ్వేల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. నామినేషన్‌కి ముందు కేసీఆర్‌ కోనాయిపల్లి వేంకటేశ్వరుడ్ని దర్శించుకున్నారు. ఉదయం 11 గంటల సమీపంలో ఫాంహౌజ్‌ నుంచి తన దత్తత గ్రామమైన గణేశ్‌పల్లి, తిగుల్, తిమ్మాపూర్, రాయవరం గ్రామాల మీదుగా కేసీఆర్‌ ఎర్రవల్లి చేరుకున్నారు.

ఎర్రవల్లిలో కేసీఆర్‌కు ప్రజలు పూలవర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు. తిగుల్‌ గ్రామంలో మాజీ సర్పంచ్‌ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు సీఎం కాన్వాయ్‌కు సుస్వాగతం పలికారు. కోనాయిపల్లిలో పూజల అనంతరం కేసీఆర్‌ తిరిగి ఫాంహౌజ్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 2:20 గంటలకు ఆయన ఫాంహౌజ్‌ నుంచి గజ్వేల్‌లో నామినేషన్‌ వేసేందుకు బయలుదేరారు. నామినేషన్‌ తర్వాత కేసీఆర్‌ మళ్లీ ఫాంహౌజ్‌కు చేరుకున్నారు.  

మరిన్ని వార్తలు