ఘనంగా హనుమాన్‌ జయంతి

11 May, 2018 11:51 IST|Sakshi
విద్యానగర్‌ కాలనీలోని హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు

హనుమాన్‌ జయంతిని గురువారం కొత్తగూడెం, పాల్వంచ, జూలూరుపాడులో ఘనంగా నిర్వహించారు. ఆంజనేయస్వామికి పూజలు చేశారు. ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఆలయ  కమిటీలు, హనుమాన్‌æ సేవా సమితీల  ఆధ్వర్యంలో హనుమాన్‌ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు

కొత్తగూడెంటౌన్‌ : జిల్లా కేంద్రంలోని రామవరం సీఆర్‌పీ క్యాంప్‌లోని ఆంజనేయస్వామి ఆలయం, రుద్రంపూర్‌లోని హనుమాన్‌ దేవాలయం, రైటర్‌బస్తీలోని మాస్టర్‌ ఈకే విద్యాలయం హనుమాత్‌ సేవా సమితి ఆధ్వర్యంలో, బస్టాండ్‌ సెంటర్లోని హనుమాత్‌ సేవా సమితి ఆధ్వర్యంలో, ఇల్లెందు క్రాస్‌ రోడ్డులోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం, విద్యానగర్‌ కాలనీలోని ఆంజనేయస్వామి ఆలయం, పాలకేంద్రంలోని హనుమాన్‌ ఆలయంలో స్వామివారి జయంతిని నిర్వహించారు.
జూలూరుపాడులో.. 
జూలూరుపాడు: మండలంలోని వెంగన్నపాలెం, జూలూరుపాడు, గుండెపుడి, పాపకొల్లు, భేతాళపాడు, కాకర్ల, పడమటనర్సాపురం, సురారం, బచ్చలకోయగూడెం తదితర గ్రామాల్లోని శ్రీఆంజనేయస్వామి ఆలయాల్లో స్వామివారి జయంతిని జరుపుకున్నారు. కొన్నిచోట్ల ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాలు జరిగాయి.

మరిన్ని వార్తలు