సీఎం నల్లగొండ పర్యటనకు ఆటంకాలు

12 Jun, 2015 16:00 IST|Sakshi
సీఎం నల్లగొండ పర్యటనకు ఆటంకాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నల్లగొండ జిల్లా పర్యటనకు స్వల్ప ఆటంకం ఎదురైంది. మర్రిగూడ మండలం శివన్నగూడెంలో భారీవర్షం కురిసింది. వాస్తవానికి దిండి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ రావాల్సి ఉంది.

అయితే.. పెనుగాలి, వర్షం ధాటికి ముఖ్యమంత్రి సభా వేదిక పూర్తిగా ధ్వంసమైంది. దాంతోపాటు.. ముఖ్యమంత్రి రావాల్సిన మార్గంలో కనీసం 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. దాంతో.. ముఖ్యమంత్రి సభకు అంతరాయం కలిగింది.

మరిన్ని వార్తలు