పరిపూర్ణానంద స్వామికి హైకోర్టులో ఊరట

14 Aug, 2018 11:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైకోర్టులో పరిపూర్ణానంద స్వామికి ఊరట లభించింది. హైదరాబాద్‌ నగర పోలీసులు పరిపూర్ణానంద స్వామికి జారీ చేసిన నగర బహిష్కరణ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనర్‌లు ఆయనపై ఆరునెలల పాటు విధించిన నగర బహిష్కరణను కోర్టు నిలిపివేసింది. తనపై విధించిన నగర బహిష్కరణను సవాల్‌ చేస్తూ పరిపూర్ణానంద స్వామి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. శ్

శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా పరిపూర్ణానంద స్వామి ధర్మాగ్రహ యాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించడంతో ఆయనను నగరం నుంచి బహిష్కరిస్తూ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ నిర్ణయించారు.

ఈ మేరకు జులై 10న పరిపూర్ణానందకు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా ఆరు నెలల పాటు హైదరాబాద్‌లో అడుగుపెట్టొద్దని, నోటీసులు అందుకున్న 24 గంటల్లో నగరాన్ని విడిచిపెట్టాలని అందులో పేర్కొన్నారు. మరోవైపు పరిపూర్ణానంద నగర బహిష్కరణకు ముందే కత్తి మహేష్‌ను కూడా ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేసిన విషయం తెలిసిందే.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా