హైదరాబాదీలు గట్టోళ్లే!

31 May, 2020 01:50 IST|Sakshi

‘మెంటల్‌ వెల్‌ బీయింగ్‌ ఇండెక్స్‌’లో భాగ్యనగరానికి మూడో స్థానం

లాక్‌డౌన్‌ 1–3S మధ్య వివిధ నగరాల ప్రజల మానసిక స్థితిగతులపై సర్వే

టీఆర్‌ఏ కరోనా వైరస్‌ కన్జూమర్‌ ఇన్‌సైట్‌–2020 పేరిట అధ్యయనం

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కాలంలో భవిష్యత్‌లో ఎదుర్కోబోయే సమస్యలు, సవాళ్లు, భయాలను ధైర్యంగా ఎదుర్కొ ని, మానసికంగా స్థిమితంగా కొనసాగడంలో హైదరాబాదీలు దేశంలో మూడో స్థానంలో నిలిచారు. లాక్‌డౌన్‌–1 నుంచి లాక్‌డౌన్‌–3 వరకు ఆయా సందర్భాల పరిశీలనల్లో ఢిల్లీ ప్రథమ స్థానంలో నిలవగా, రెండో స్థానంలో గువాహటి, మూడో స్థానంలో హైదరాబాద్‌ నిలిచాయి. మెంటల్‌ వెల్‌బీయింగ్‌ ఇండెక్స్‌ (ఎండబ్ల్యూబీఐ)లో వెల్లడైన వివరాల ప్రకారం...హైదరాబాద్‌ నగరం ఒక్కటే గుడ్‌ కేటగిరీ నుంచి 18 శాతం పాయింట్లు పెంచుకుని ఎక్స్‌లెంట్‌ మెంటల్‌ వెల్‌బీయింగ్‌ కేటగిరీకి చేరుకున్నట్టు స్పష్టమైంది. కొన్ని నగరాల్లో ని ప్రజల మానసిక ఆరోగ్యం తగ్గినట్టుగా ఈ పరిశీలనలో వెల్లడికాగా కొన్నింటిలో మెరుగైనట్లుగా తేలింది. వివిధ రూపాల్లో ఎదురయ్యే భయాలను ఒక్కొక్కరు ఎలా ఎదుర్కొంటారన్న దానిపై మానసిక ఆరోగ్యం అంచనా వేస్తున్నారు. భావోద్వేగం, ప్రవర్తన తీరు, ఆలోచనలు, జీవిత పరమార్థంపై అవగాహన వంటివి ఆధారం గా దీన్ని నిర్ధారిస్తారు. (కోవిడ్ @ ఇండియా)

బెంగ వీడని పెద్దనగరాలు..
కరోనా కారణంగా భవిష్యత్‌లో తీవ్రమైన సంక్షోభం ఎదురుకావొచ్చుననే భయాలు, అపోహలు ఏర్పడ్డ ప్రస్తుత పరిస్థితు ల్లో ప్రజలు సవాళ్లను ఏ విధంగా అధిగమిస్తారు? వీటి వల్ల వారి మానసిక ఆరోగ్యం ఎలా ఉంటుందని అంచనా వేసేం దుకు టీఆర్‌ఏ అనే కన్జూమర్‌ ఇన్‌సైట్స్‌ అండ్‌ బ్రాండ్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ పరిశీ లన నిర్వహించింది. మొదటి లాక్‌డౌన్‌ కా లానికి సంబంధించి టీఆర్‌ఏ కరోనా వైర స్‌ కన్జుమర్‌ ఇన్‌సైట్స్‌–1 ఏప్రిల్‌ 24న ఒక నివేదిక ప్రకటించింది. అందులో పరిశీ లించిన వివిధ అంశాలకు సంబంధించిన అధ్యయనాన్ని లాక్‌డౌన్‌ 3.0 పేరిట తా జాగా ప్రకటించారు. లాక్‌డౌన్‌– 1 నుంచి లాక్‌డౌన్‌–3కు వచ్చేటప్పటికీ నాగపూర్‌ 36%తో, కొచ్చి 37%, కోయంబత్తూరు 39%తో ‘వెరీ పూర్‌’ మెంటల్‌ వెల్‌బీయింగ్‌ కేటగిరీలో చేరాయని ఆ సంస్థ సీఈవో ఎన్‌.చంద్రమౌళి తెలిపారు.అహ్మదాబాద్, కోల్‌కతా, ముంబై, చెన్నై నగర ప్రజలు కూడా వివిధ అంశాల్లో మెరుగైన తీరును కనబరచలేకపోయారని పేర్కొన్నారు.  (కరోనా : 8 నుంచి అన్లాక్–1)

లాక్‌డౌన్‌–1 నుంచి లాక్‌డౌన్‌–3 వరకు మారిన నగరాల ర్యాంకింగ్‌ (టాప్‌–10)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు