సీఎస్ గా ప్రదీప్ చంద్ర: ఐఏఎస్ ల బదిలీ

12 Dec, 2016 15:16 IST|Sakshi
సీఎస్ గా ప్రదీప్ చంద్ర: ఐఏఎస్ ల బదిలీ

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కర్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ప్రదీప్ చంద్ర బాధ్యతలు స్వీకరించిన కొద్ది సేపటికే రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

కీలకమైన భూపరిపాలన కమిషర్(సీసీఎల్ఏ) అదనపు బాధ్యతలను సీఎస్ ప్రదీప్ చంద్రే నిర్వహించనున్నారు. ఇంతకు ముందు కూడా ఆయనే సీసీఎల్ఏ(అదనపు బాధ్యత)గా కొనసాగిన సంగతి తెలిసిందే.  సీఎస్ గా పదవీ విరమణ పొందిన రాజీవ్ శర్మను సీఎం కేసీఆర్, సచివాలయ సిబ్బంది ఘనంగా సత్కరించారు.  ఆయా శాఖల వారీగా ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి..

రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎంజీ గోపాల్
విద్యుత్ శాఖ కార్యదర్శిగా అజయ్ మిశ్రా
బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా అశోక్ కుమార్
గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా రమేశ్ దత్ ఎక్కా
రెవెన్యూ(ఎక్సైజ్) ముఖ్య కార్యదర్శిగా సోమేశ్ కుమార్
మత్య్స శాఖ ముఖ్య కార్యదర్శిగా బి. వెంకటేశ్వరరావు
మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్(అదనంగా ఐ అండ్ పీఆర్ బాధ్యతలు)
హౌసింగ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా చిత్రా రామచంద్రన్
రవాణా శాఖ కమిషనర్ గా సునీల్ శర్మ (అదనపు బాధ్యతలు)
యువజన వ్యవహారాల కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్
ఆర్థిక శాఖ కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా నియమితులయ్యారు.

మరిన్ని వార్తలు